వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరుగనున్న సెల్‌ఫోన్, సిగరేట్ ధరలు: ఎపికి ఓడ రేవు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Central Budget 2013 14
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం గురువారం పదకొండు గంటలకు సభలో 2013 - 14 సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా పలు వస్తువుల ధరలు పెరిగనుండగా మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. ప్రస్తుత బడ్జెట్ ద్వారా సెల్‌ఫోన్లు, సెట్‌టాప్ బాక్సులు, మోటారు సైకిళ్లు, విలాసవంతమైన కార్ల ధరలు పెరుగనున్నాయి. తోలు వస్తువులు, పాదరక్షలు, రెడిమేడ్ దాస్తుల ధరలు తగ్గనున్నాయి.

భవిష్యత్తులో ఇంధన అవసరాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్న దృష్ట్యా బొగ్గు దిగుమతులు త్వరలోనే బాగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం ప్రకటించారు. క్రమేపీ ఈ దిగుమతులను తగ్గించుకోవలసిన అవసరం ఉంటుందని ఆయన చెప్పారు. 2013-14 బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటుకు సమర్పిస్తూ ప్రయివేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో త్వరలోనే బొగ్గు గనులనుంచి బొగ్గు త్రవ్వకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు.

మార్బుల్ పైన సుంకం పన్ను పెంపు
రూ.2వేలకు పైబడిన మొబైల్ ఫోన్‌లకు 6శాతం పెంపు
ఎస్‌వియులపై 27 నుండి 30 శాతం పెంపు
సెట్‌టాప్ బాక్సులపై 5 నుండి 10 శాతం పెంపు
సిగరేట్‌ల పైన ఎక్సైజ్ సుంకం 18 శాతం
సినిమా రంగానికి సేవా పన్ను నుండి మినహాయింపు
విద్యా సంకం 3 శాతం కొనసాగింపు
రక్షణ రంగానికి కేటాయింపుల్లో 2.03 లక్షల కోట్లకు పెంపు
చేనేత, లోదుస్తులపై పన్ను మినహాయింపు
మహిళల భద్రతకు వెయ్యి కోట్లతో నిర్భయ్ ఫండ్
యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం

ఎపికి...

ఆంధ్రప్రదేశ్, బెంగాల్‌లో భారీ ఓడ రేవు నిర్మాణం
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన-2 కింద ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక నిధులు

English summary
10 per cent surcharge on income above Rs 1 crore. Tax slab tweaked only for 10 per cent tax break.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X