అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పన్నుల మోత.. ఆస్తుల జప్తు, మంత్రి బొత్స కామెంట్స్, విపక్షాల ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో పన్నుల మోత మోగుతుంది. వేయడమే కాదు.. కట్టకుంటే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో దుమారం రేగింది. మంత్రి బొత్స కూడా కట్టాల్సిందేనని అనడంతో.. విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. చెత్తకు పన్ను కట్టలేదని చెత్తను పట్టుకొచ్చి షాపుల ముందు పారేసిన ఘటన విమర్శలను ఎదుర్కొంటుంది. ప్రభుత్వం ఇష్టానుసారంగా విధించే పన్నులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

 కట్ కట్..

కట్ కట్..


కరెంట్‌ బిల్లు కట్టకపోతే కరెంట్‌ కట్‌ చేయడం.. ఆస్తి పన్ను కట్టకుంటే ఆస్తులు జప్తు చేయడం.. ఇలా పలు రకాల పన్నుల విషయంలో అధికారులు ప్రజలపై తీసుకునే చర్యలు ఏపీలో సర్వసాధారణంగా మారిపోయాయి. చెత్త పన్ను, ఆస్తి పన్ను పేరుతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తాం అని మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్ చేశారు. కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ తీసేస్తామనటం తప్పు అంటే ఎలా? అంటూ ప్రశ్నించారు.. ఆస్తుల జప్తు ఇవాళ కొత్తగా వచ్చిన అంశం కాదు..పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పటం తప్పు అంటే ఎలా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అంటూ ప్రశ్నించారు. ఆస్తులను జప్తు చేయటం తమ ఉద్దేశ్యం కాదు.. పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు ఎలా బలోపేతం అవుతాయి? దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి బొత్స అన్నారు.

ఇక్కడ మాత్రం ఇలా..

ఇక్కడ మాత్రం ఇలా..


ఏపీలో మాత్రం సీన్ రివర్స్ గా ఉంది. పన్ను వసూలు కోసం తూర్పు గోదావరి జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. పన్నులు కట్టకపోతే వడ్దీ వ్యాపారుల తరహాలో ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పన్ను బకాయిలు చెల్లించని వారి సామాన్లు జప్తు చేస్తామంటూ ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేయడంపై మొన్నీమధ్య కాకినాడలో వివాదం రాజుకోగా తాజాగా ఇప్పుడు అదే జిల్లాలోని పిఠాపురంలో మరో ఘటన జరిగింది.

జనం ఆందోళన

జనం ఆందోళన


ఇంటిపన్ను, కుళాయి పన్ను, చెత్త పన్ను కట్టలేదని మున్సిపల్‌ అధికారులు రెండు ఇళ్లకు సీలు వేశారు. 15వ వార్డు మోహన్‌నగర్‌లోని గొర్ల సత్తిబాబు ఇంటికి తాళం వేశారు. ఇంట్లో మహిళలు ఉండగానే అధికారులు గేటుకు తాళం వేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పన్ను చెల్లించేందుకు కొంత సమయం కోరినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. చివరికి స్థానికులు ఆందోళనకు దిగడంతో గొర్ల సత్తిబాబు ఇంటి గేటుకు వేసిన సీల్‌ను అధికారులు తొలగించారు. ప్రభుత్వ చర్యపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఇదీ ఏ మాత్రం బాగోలేదని.. తీరు మార్చుకోవాలని సజెస్ట్ చేశాయి.

English summary
andhra pradesh minister botsa satyanarayana made controversial comments on taxes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X