కార్తీక దీపంతో నాలుగు ఇళ్ళు బూడిద చేసిన కాకి!
అదృష్టం అడ్డం తిరిగితే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుంది అని ఏదో సినిమాలో చెప్పినట్టు మన టైం బాగోకపోతే తాడే పామై కరుస్తుంది. ఇక అటువంటి ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది. సహజంగా మనం బయట ఏమైనా పెడితే పక్షులు, జంతువులు వాటిని తీసుకుని వెళ్లడం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అవేవో తినే వస్తువులు అయితే పర్వాలేదు కానీ ఒక కాకి దీపాన్ని ఎత్తుకెళ్లి విధ్వంసం సృష్టించింది.
కార్తీక మాసం పూజలు, దీపారాధన
విజయనగరం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ప్రతీ ఒక్కరినీ విస్మయానికి గురిచేసింది. అసలు కాకి దీపాన్ని తీసుకువెళ్లి ఏం చేసింది అనేది తెలుసుకుందాం. విజయనగరం జిల్లాలోని గరివిడి మండలం కోనూరు గ్రామంలో ఒక ఇంటి డాబా పైన కార్తీకమాసం సందర్భంగా పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తులసి కోటలో దీపాన్ని పెట్టి పూజ చేసి వెళ్లిపోయారు.

కార్తీక దీపాన్ని ఎత్తుకెళ్ళి పూరి గుడిసెలపై వేసిన కాకి.. నాలుగిళ్ళు దగ్ధం
ఆపై అక్కడకు వెళ్లిన కాకి తులసికోట వద్ద పెట్టిన దీపాన్ని ఎత్తుకెళ్లి పక్కనే ఉన్న ఒక తాటాకు ఇంటి పైన పడేసింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకొని ఆ ఇల్లు తగలబడిపోగా, దాని పక్కనే ఉన్న మరో మూడు ఇళ్లకు కూడా మంటలు వ్యాపించి నాలుగు తాటాకు ఇళ్ళు బుగ్గిపాలయ్యాయి. నంబూరి గోపి, రెడ్డి సాంబ, కొక్కెర మాలచ్చమ్మ, మహంతి లక్ష్మీలకు చెందిన నాలుగు తాటాకు ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి.
పంట పెట్టుబడులకు తెచ్చిన డబ్బు, బంగారం కాలి బూడిద
అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో కౌలు రైతుగా పని చేసుకునే గోపి రబీ పెట్టుబడుల కోసం లక్ష రూపాయలు అప్పుగా తెచ్చి ఇంట్లో పెట్టారు. ఆ డబ్బుతో పాటు, అర తులం బంగారం కూడా కాలి బూడిదయ్యింది. తాసిల్దారు సిహెచ్ బంగారు రాజు సంఘటన స్థలాన్ని సందర్శించి నాలుగు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేశారు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications