రేప్ అటెంప్ట్ : తుక్కు రేగొట్టింది.. కళ్లు బైర్లు గమ్మి దెబ్బకు పరార్

Subscribe to Oneindia Telugu

రెడ్డిగూడెం : శారీరకంగా మహిళల కంటే ధృఢవంతులమన్న భావనతో.. మహిళలను ఎలాగైనా లోబర్చుకోవాలనే నికృష్టులకు ప్రస్తుత సమాజంలో కొదవలేదు. సహాయం పేరుతో మహిళలను నమ్మించి ఆపై వాళ్ల మీద అఘాయిత్యాలకు తెగబడుతున్న ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ అఘాయిత్యాలకు బలైపోయే మహిళలు కొందరైతే.. తిరగబడి సదరు మృగాళ్ల తాట తీసెవాళ్లు
మరికొందరు.

కృష్ణా జిల్లా సీతారాంపురం సమీపంలో తనపై అత్యాచారం చేయబోయిన ఓ మృగాడి తాట తీసింది ఓ వివాహిత. లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఆ వివాహిత దిగాల్సిన స్టేజీ రాగానే కారును పక్కదోవ పట్టించి ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు బాబూరావు అనే ఓ ప్రబుద్దుడు. అయితే బాబురావు చర్యలను గట్టిగా ప్రతిఘటించిన వివాహిత అతడి కళ్లలో కారం చల్లడంతో దెబ్బకు అక్కడి నుంచి పరారయ్యాడు బాబురావు.

A woman escaped safely from a rape attempt in KRISHNA district

పూర్తి వివరాలను పరిశీలిస్తే.. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో నూజివీడు నుంచి రెడ్డిగూడెంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చేందుకు విస్సన్నపేటలోని స్టేజీ వద్ద 27 ఏళ్ల వివాహిత బస్సుకోసం వేచి ఉంది. అదే సమయంలో అటువైపుగా కారులో (ఏపీ20వై4848) వెళ్తున్న బాబురావు అనే వ్యక్తి వివాహిత వద్దకు వచ్చి కారు ఆపాడు. తాను రెడ్డిగూడెం వైపే వెళ్తున్నానని తనతో వస్తే అక్కడ దిగబెడుతానని మాయ మాటలు చెప్పి వివాహితను కారు ఎక్కించుకున్నాడు.

అయితే అతని దురుద్దేశాన్ని పసిగట్టని వివాహిత అతనితో పాటు కారులో బయలుదేరింది. తీరా కారు సీతారాంపురం స్టేజీ సమీపం నుంచి కూనపరాజుపర్వ అంతర్గత రహదారి వైపు మళ్ళించడంతో వివాహితకు అనుమానం మొదలైంది. అప్పటికే రెచ్చిపోయిన బాబురావు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ బలవంతం చేయబోయాడు. దీంతో వెంటనే తన బ్యాగులో ఉన్న కారం పొట్లాన్ని తీసుకున్న మహిళ బాబురావు కళ్లల్లో చల్లింది.

వివాహిత గట్టిగా తిరగబడడంతో కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు బాబురావు. అనంతరం ఆమె తన తల్లికి సమాచారమివ్వడంతో రెడ్డిగూడెంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్సై అభిమన్యు కారును స్వాధీనం చేసుకుని బాబురావు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Woman safely escaped from a rape attempt which happened in seetarampuram. A man offered lift to her and on the way he tried to rape the woman

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి