అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్‌ షర్మిల మద్దతు కోరిన అమరావతి జేఏసీ-ఇద్దరూ సాక్షి బాధితులమే- మీకూ మద్దతు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు ముందే వైఎస్‌ షర్మిల ఏపీలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. తెలంగాణలో ఉద్యోగాల కోసం మూడు రోజుల దీక్ష చేసిన షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం, తదనంతర పరిణామాలపై అమరావతి మహిళా జేఏసీ నేతలు స్పందించారు. తాము ఏడాది కాలంగా చేస్తోంది ఇదే అంటూ ఆమెకు గుర్తుచేశారు. మీ పోరాటానికి మద్దతు అంటూనే, మా పోరాటానికి కూడా మద్దతు ఇవ్వాలంటూ షర్మిలను కోరారు. అంతే కాదు మనిద్దరూ సాక్షిటీవీ బాధితులమేనంటూ షర్మిల వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మరో సెంటిమెంట్‌ను కూడా జత చేశారు.

 వైఎస్ షర్మిలకు అమరావతి జేఏసీ లేఖ

వైఎస్ షర్మిలకు అమరావతి జేఏసీ లేఖ

తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్దమవుతున్న వైఎస్‌ జగన్‌ సొదరి షర్మిలకు అమరావతి మహిళా జేఏసీ నేతలు ఇవాళ ఓ లేక రాశారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోసం ఆమె చేస్తున్న పోరాటంతో పాటు పలు విషయాలను ఇందులో వారు ప్రస్తావించారు. షర్మిల పోరాటానికి అమరావతి మహిళా జేఏసీ నేతలు మద్దతు తెలిపారు. ఆమె పోరాటాన్ని అమరావతి కోసం తాము చేస్తున్న పోరాటంతో పోలుస్తూ పలు విషయాలను తమ లేఖలో పొందుపరిచారు. తమకూ మద్దతివ్వాలని వైఎస్ షర్మిలను కోరారు. మధ్యలో కేసీఆర్‌ ప్రభుత్వం తరహాలోనే మీ అన్నగారి ప్రభుత్వం (వైసీపీ సర్కార్‌) ఇక్కడ తమను అణిచేస్తోందంటూ గుర్తు చేశారు.

షర్మిల పోరుతో అమరావతి ఉద్యమానికి పోలిక

షర్మిల పోరుతో అమరావతి ఉద్యమానికి పోలిక

తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం మీరు చేసిన ధర్నా సందర్భంగా గాయపడటం విని సాటి మహిళలుగా బాధపడ్డామని, మీ పోరాటంలో ఎంత న్యాయం ఉందో, మేం 491 రోజులుగా అమరావతిలోనే కరోనా సమయంలోనూ రాజధానిని కొనసాగించాలంటూ అప్రతిహతంగా చేస్తున్న ఆందోళనలోనూ అంతే న్యాయముందని పేర్కొన్నారు. మిమ్మల్ని ఒక్కసారి మాత్రమే పోలీసులు అవమానించి గాయపరిచారని, కానీ మమ్మల్ని ఏడాదిగా జగన్మోహన్‌రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసులు ప్రతీరోజూ అవమానించి గాయపరుస్తున్న విషయం మీకు తెలియనిది కాదంటూ మహిళా జేఏసీ నేతలు గుర్తు చేశారు.

ఇద్దరం సాక్షి టీవీ బాధితులమే

ఇద్దరం సాక్షి టీవీ బాధితులమే

హైదరాబాద్‌లో నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష సందర్భంగా సాక్షి టీవీ కవరేజ్‌ ఇవ్వడం లేదని షర్మిల చేసిన వ్యాఖ్యల్ని సైతం అమరావతి మహిళా జేఏసీ నేతలు లేఖలో ప్రస్తావించారు. తెలంగాణలో మీ పోరాటానికి మీ వదిన భారతీరెడ్డి గారి సారధ్యంలోని సాక్షి మీడియా ఏ విధంగా కవరేజీ ఇవ్వడం లేదో, ఇక్కడ మా అమరావతి పోరాటానికీ మీ వదినమ్మ గారి సాక్షి మీడియా కవరేజీ ఇవ్వకపోగా వ్యతిరేక కథనాలు రాస్తోందని అమరావతి మహిళా జేఏసీ నేతలు షర్మిల దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో మనమిద్దరం సాక్షి మీడియా బాదితులమే అంటూ వాపోయారు.

కేసీఆర్‌ సమాధానం చెప్పాలంటే జగన్‌ కూడా చెప్పాల్సిందే

కేసీఆర్‌ సమాధానం చెప్పాలంటే జగన్‌ కూడా చెప్పాల్సిందే


మీపై జరిగిన దాడికి తెలంగాణ ప్రభుత్వం దిగివచ్చి సమాధానం ఇవ్వాలని మీ తల్లిగారు, వైసీపీ గౌరవాధ్యక్షురాలయిన శ్రీమతి విజయమ్మ గారు డిమాండ్ చేశారు. నిజమే. దానికి తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. అదేవిధంగా అమరావతిలో మాపై ప్రతిరోజూ వివిధ రూపాల్లో జరుగుతున్న దాడులకు మీ అన్న గారయిన జగన్మోహర్‌రెడ్డి గారి ప్రభుత్వం కూడా దిగివచ్చి సమాధానం చెప్పడమే ధర్మం కదా? విజయమ్మ గారు, మీరు ఈ విషయంలో జగన్ గారికి ఓమాట చెబితే తెలంగాణలో మీరు చేస్తున్న పోరాటానికి విశ్వసనీయత ఉంటుంది అని అమరావతి మహిళా జేఏసీ నేతలు పేర్కొన్నారు.

అమరావతికి వైఎస్‌ షర్మిల మద్దతు

అమరావతికి వైఎస్‌ షర్మిల మద్దతు

అమరావతి కోసం మేం చేస్తున్న ఆందోళనకు మీ మద్దతు ఆశిస్తున్నట్లు మహిళా జేఏసీ నేతలు తెలిపారు. తెలంగాణ కోడలిగా మీరు అక్కడ పోరాటం చేస్తున్నట్లే, ఆంధ్రా బిడ్డగా మేం చేస్తున్న పోరాటానికి స్వయంగా వచ్చి మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం. ఆ మేరకు మిమ్మల్ని ఆహ్వానించేందుకు అమరావతి మహిళా జేఏసీ ప్రతినిధి బృందం మీ వద్దకు రావాలనుకుంటున్నాం. కాబట్టి మీ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాం. ఒకవేళ కోవిడ్ తీవ్రత కారణంగా మీరు రాలేకపోయినప్పటికీ, మా పోరాటానికి మద్దతునిస్తున్నట్లు పత్రికా ప్రకటన అయినా ఇచ్చినా మా పోరాటానికి మేలు చేసినవారవుతారు. మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం అంటూ మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ పేరుపై ఈ లేఖ విడుదల చేశారు.

English summary
amaravati women jac on tuesday seek ys sharmila appointment and support for their year long movement over capital city, jac also reminds sharmila that both are sakshi tv victims in coverage issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X