యూట్యూబర్ అన్వేష్ కు బిగ్ షాక్.. మీకు అష్ట దరిద్రాలు అంటూ అన్వేష్ శాపం!
నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇన్ స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో తాజాగా మహిళల డ్రెస్సింగ్ పైన మాట్లాడుతూ హిందూ దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్వేష్ కు ఉచ్చు బిగుస్తున్న విషయం తెలిసిందే .హిందూ దేవతలపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు పలువురు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పంజాగుట్ట పోలీసులు అన్వేష్ instagram వివరాలు తెలపాలంటూ instagram కు లేఖ రాశారు.
అన్వేష్ యూ ట్యూబ్ ఛానల్ అన్ సబ్ స్క్రైబ్ చేస్తున్న నెటిజన్లు
ఇక ఇదే సమయంలో అన్వేష్ youtube ఛానల్ కు ఇప్పటివరకు ఉన్న సబ్స్క్రైబర్స్ షాక్ ఇస్తున్నారు. unsubscribe చేయడం మొదలుపెట్టారు. దీంతో అన్వేష్ తాను ఎవరిని ఫాలో అవమని చెప్పలేదని, తన యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేయమని చెప్పలేదని, ఇష్టమైన వాళ్ళు ఫాలో చేశారంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరో దుమారం రేపాయి.

తాను ఎవరినీ మోసం చేయలేదన్న అన్వేష్
తాను ఎవరిని మోసం చేయలేదని, తాను ఒక యూట్యూబర్ గా ప్రపంచంలోని అన్ని దేశాలు తిరగడానికి పంచభూతాలు సహకరిస్తున్నాయని తనకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఎవరిని తన youtube ఛానల్ చూడమని, instagram లో తన పోస్టులు చూడమని ప్రాధేయపడలేదని, ఇష్టమైన వాళ్ళు చూస్తారు, ఇష్టం లేని వాళ్ళు పోతారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
నేను ఇండియన్ సిటిజన్ నే.. చట్టపరంగా వెళ్తా
తనను పోలీసులు ఏది అడిగినా దానికి సమాధానం చెబుతానని, చట్టపరంగా, న్యాయపరంగా ముందుకు వెళతానని అన్నారు. 2026 లో అందరి చేత శభాష్ అనిపించుకుంటాను అని అన్వేష్ తెలిపారు. విదేశాలలో ఉన్నప్పటికీ ఇండియన్ సిటిజన్ నని అన్వేష్ స్పష్టం చేశారు. చిన్నప్పటినుంచి వినాయకుడి గురించి, భగవద్గీత గురించి ఎన్నో చెప్పానని అన్నారు.
ఫాలోవర్స్ ప్రమోషన్ చేసే వాళ్లకు కావాలి తనకు కాదన్న అన్వేష్
చీరలు కట్టుకున్న ఆడవాళ్ళని 60 వేల మందిని రేప్ చేశారు అని చెబితే, అది పక్కనపెట్టి సీతమ్మను ఏదో అన్నానని ఈ దుమారం అంతా రేపారు అని అన్వేష్ పేర్కొన్నారు. instagram లో ఫాలోవర్స్ ప్రమోషన్లు చేసే వాళ్లకు కావాలని, తనకు కాదన్నారు. మొత్తానికి అన్వేష్ కు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తగ్గుతూ ఉండగా దానిని కూడా అన్వేష్ లైట్ తీసుకుంటూ తనదైన శైలిలో వీడియోస్ చేస్తున్నారు.
వారికి అష్ట దరిద్రాలు ఖాయం అంటూ శాపనార్ధాలు
తనను డిస్టర్బ్ చేస్తున్న వారికి 2026 సంవత్సరంలో అష్ట దరిద్రాలు పట్టుకుంటాయని, తనకు నాలుక మీద మచ్చలు ఉన్నాయని అంటే జరుగుతుందంటూ శపించారు. ఎవరూ తనను ఏమీ చెయ్యలేరని ఆయన తనదైన వీడియోలు చేశారు.
-
చెప్పుతో పాటు ఆ సింబల్ చూపించిన స్టార్ బ్యూటీ.. కారణం అదే ??? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ












Click it and Unblock the Notifications