Gram Panchayats: పంచాయతీలకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్..! ఇక పండగే..!
ఏపీలో గ్రామ పంచాయతీ (gram panchayats)లకు, వాటిని నడుపుతున్న సర్పంచ్ లకు ప్రభుత్వం తాజాగా ఓ గుడ్ న్యూస్ చెప్పింది. కొంతకాలంగా నిధులు లేక, చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు ఊరట కల్పించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీన్ని అమలు చేసుకునేందుకు పంచాయతీలకు అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది గ్రామ పంచాయతీలకు మేలు కలగనుంది.
గతేడాది రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పదవీకాలం పూర్తవుతుందన్న కారణంతో సర్పంచ్ లను 15వ ఆర్ధిక సంఘం నిధులు వాడుకోకుండా ప్రభుత్వం బ్రేక్ వేసింది. అయితే జనవరి 5న ఈ నిధులు వాడుకునేందుకు వీలుగా పంచాయతీలు తీర్మానాలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. దీంతో పంచాయతీల్లో ఈ మేరకు నిధుల వాడకానికి వీలుగా తీర్మానాలు చేసుకున్నారు. వీటి ప్రకారం ఇప్పుడు 15వ ఆర్ధిక సంఘం నిధులు వాడుకునేందుకు ప్రభుత్వం వారికి వెసులుబాటు కల్పించింది.

ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 5న చేసిన తీర్మానాల మేరకు ఆర్ధిక సంఘం ఇచ్చి నిధులు వాడుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. పంచాయతీల్లో పనులు చేసి, మెజర్మెంట్స్ పుస్తకాల్లో నమోదు చేస్తే బిల్లులు చెల్లించవచ్చని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పంచాయతీల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపులు వేగవంతం కానున్నాయి. అలాగే ఇప్పటివరకూ పంచాయతీల నుంచి బిల్లులు రాక అల్లాడుతున్న కాంట్రాక్టర్లకు ఊరట కలగబోతోంది.
-
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!












Click it and Unblock the Notifications