ఏపీలో ఉద్యోగాల జాతర, భారీగా నోటిఫికేషన్లు సిద్దం - ఏ శాఖలో ఎన్ని పోస్టులు..!!
ఏపీలో ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతోంది. జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. శాఖల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులతో పాటుగా కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల లెక్కలు సిద్దం చేస్తోంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో వివరాలు నమోదు చేయిస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలు ఉండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీటి భర్తీకి సంబంధించిన ప్రక్రియను ఖరారు చేయనున్నారు. శాఖల వారీగా ఖాళీలను నిర్ధారించారు.
ఏపీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటన దిశగా కసరత్తు వేగవంతం చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే డీఎస్సీ -2025 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసారు. వచ్చే ఫిబ్రవరి లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ కు రంగం సిద్దం చేస్తున్నారు. కాగా.. ఇప్పటి వరకు 157 విభాగాల మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను నిర్ధారించాయి. దాదాపుగా 99 వేల ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ పూర్తయితే నే మొత్తం ఖాళీల లెక్క తేలనుంది. నేరుగా నియామకాలకు వచ్చే వాటిని నిరుద్యోగ యువతతో ఆర్థిక శాఖ వద్ద ఉన్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం 13,000 ఖాళీలు. ఈ శాఖలోని 7 హెచ్ఓడీలు ఇప్పటి వరకు 4,787 ఖాళీలను నిర్ధారించాయి. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,552 గా తేల్చారు.

అదే విధంగా ఉన్నత విద్యాశాఖలో 7 వేల పోస్టులు ఖాళీలు ఉండగా.. యూనివర్సిటీల్లో 3 వేలకు పైగా ఉన్న ఖాళీలను కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. కాగా, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలో ఉన్న 27 వేల ఖాళీల్లో సుమారు 23 వేలకు నేరుగా నియామకా లు చేపట్టాల్సి ఉంది. .నైపుణ్యాభివృద్ధి, శిక్షణ విభాగంలో 4 వేలకు పైగా ఖాళీలు నిర్ధారించారు. వ్యవసాయ శాఖలో 3 వేలకు పైగా ఖాళీలుండగా వీటిలో డీఆర్ పోస్టులు 2,400.పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 26 వేల వరకు ఉండొచ్చని నిర్ధారించారు.
మరో మూడు వేల పోస్టులను ఇన్సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేస్తారు. పాఠశాల విద్యశాఖతో సహా కలిపి 24 విభాగాలు మంజూరు పోస్టులు, ఖాళీల ఇంకా వివరాలను నిర్ధారించాల్సి ఉంది. పాఠశాల విద్యలో బోధన, బోధనేతర అన్ని రకాల ఖాళీలు కలిపి 30,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగంలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 10 వేల వరకు ఉండే ఛాన్స్ ఉంది. వీటి భర్తీకి సంబంధించి త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications