Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇండియాలోనే రిచ్చెస్ట్ ఎమ్మెల్యేలలో టాప్ 3 ఏపీలోనే.. అగ్ర స్థానంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి!

దేశ రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యం, వారి ఆర్థిక స్థితిగతులపైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఒక సమగ్ర నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ప్రజాప్రతినిధులలో 14మంది బిలియనీర్లు ఉన్నట్టు వెల్లడించింది. వీరి మొత్తం ఆస్తులు విలువ 8234కోట్లకు చేరుకుందని ఏడిఆర్ తన నివేదికలో వెల్లడించింది. అయితే ఈ ఏ డి ఆర్ నివేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ప్రతి ఒక్కరి ఫోకస్ మళ్లేలా చేసింది.

దేశంలోనే రిచ్చెస్ట్ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

అత్యంత సంపన్న మహిళా ప్రజా ప్రతినిధుల జాబితాలో మొదటి మూడు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేలు నిలిచారు. వారిలో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి చెందిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి 716. 33 కోట్ల రూపాయల ఆస్తులతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళ ప్రజాప్రతినిధిగా మొదటి స్థానంలో ఉన్నారు.

ap mlas are richest women MLAs secured the top three positions in the list of India s richest adr report

టాప్ 3 రిచ్చెస్ట్ ఏపీ నుండే

రెండవ స్థానంలో కడప టీడీపీ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి 388.10 కోట్ల రూపాయలతో రెండవ స్థానంలో నిలిచారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల కు చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవి 291.17 కోట్ల ఆస్తులతో మూడవ స్థానంలో నిలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నామినేషన్లు దాఖలు చేసిన వీరి అఫిడవిట్ల ఆధారంగా ఈ నివేదికను ఏ డి ఆర్ రూపొందించింది.

ఏపీలోని మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి ఇలా

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 కోట్లకు పైగా ఆస్తులు కలిగిన మహిళా ప్రజాప్రతినిధుల పైన కూడా ఏడిఆర్ ప్రత్యేకంగా సర్వే చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిట్టింగ్ మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 24 మంది ఉండగా వారందరి ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం మొత్తం ఆస్తులు 1781. 32 కోట్లు గా నమోదయింది. దీని ప్రకారం ఏపీలోని మహిళా ప్రజాప్రతినిధుల సగటు ఆస్తి 74 కోట్లుగా ఉంది.

తెలంగాణా మహిళా ప్రజా ప్రతినిధుల సగటు ఆస్తి ఇలా

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది ఉండగా వారి మొత్తం ఆస్తులు విలువ 159.03 కోట్లుగా ఏ డి ఆర్ నివేదిక పేర్కొంది. సగటున 14.45 కోట్ల ఆస్తిని తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో మహిళా ప్రజాప్రతినిధి కలిగి ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పోలిస్తే ఈ సగటు చాలా తక్కువ ఉండడం ప్రధానంగా కనిపిస్తుంది.

దేశ వ్యాప్తంగా మహిళా ఎమ్మెల్యేల సగటు ఆస్తి ఇదే

కాగా దేశవ్యాప్తంగా మొత్తం 466 మంది ప్రజా ప్రతినిధులలో మహిళలు కేవలం 476 మంది మాత్రమే ఉన్నారు. అంటే కేవలం 10 శాతమే మహిళలు ఉన్నారు. ఈ 476 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల మొత్తం ఆస్తులు విలువ 8,234 కోట్ల రూపాయలు. దేశ వ్యాప్తంగా ఒక్కో మహిళా ప్రజాప్రతినిధి సగటు ఆస్తి 17.30 కోట్ల రూపాయలు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళా ఎమ్మెల్యేల సగటు ఆస్తితో పోలిస్తే నాలుగు రెట్లు తక్కువగా ఉందని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+