APSRTC మహిళలకు మహా శివరాత్రి కానుక, ప్రత్యేకంగా..!!
APSRTC కీలక ప్రకటన చేసింది. మహాశివరాత్రి పర్వదినం వేళ భక్తులు పెద్ద సంఖ్యలో శైవ క్షేత్రాలకు వెళ్తారు. వీరి కోసం పెద్ద సంఖ్యలో ప్రత్యేక బస్సులను కేటాయించింది. అందులో భాగంగా రూట్లను ఖరారు చేసింది. ఛార్జీలను వెల్లడించింది. కాగా, ఈ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళల కు ఉచిత ప్రయాణం కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల డిమాండ్ అంచనాలకు అనుగుణంగా ఈ సర్వీసులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అవసరం అయితే మరిన్ని బస్సుల కేటాయించేందుకు సిద్దంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.
మహా శివరాత్రి వేళ ఆర్టీసీ భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. మహాశివరాత్రి సందర్భంగా పల్నాడు, గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచి కోటప్పకొండకు వచ్చే భక్తుల సౌక ర్యార్ధం 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నామని డీపీటీవో టీ అజిత కుమారి తెలిపారు. ప్రత్యేక బస్సుల్లోనూ స్ర్తీ శక్తి పథకం అమలు చేయనున్నట్లు వెల్లడించారు. కోటప్పకొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరవేసేందుకు 95 బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రత్యేక బస్సుల్లోనూ స్త్రీ శక్తి పథకం అమలవుతుందని వివరించారు. కోటప్పకొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరవే సేందుకు 95 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది కోటప్పకొండ నుంచి నరసరావుపేటకు తిరుగు ప్రయాణంలో బస్‌స్టేషన్‌ను పెట్లూరివారిపాలెం రోడ్డు మార్గంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

మహిళలకు ఉచిత ప్రయాణం కు అనుమతి
ఈ ఏడాది కూడా నరసరావుపేట నుంచి కొండ వరకు రూ. 30లు, కొండ దిగువ నుంచి పైకి రూ. 25లు ఛార్టీలు వసూలు చేస్తామని చెప్పారు. అయితే, మహిళలు మాత్రం ఈ బస్సుల్లోనూ ఎలాంటి టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేశారు. మరోవైపు శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లాలోని ఐదు డిపోల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కర్నూలు బస్టాండ్‌లో భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా పెరిగిన ఎండల తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు. కర్నూలు నుంచి వెంకటాపురం వరకు బస్సులో ప్రయాణించి, అక్కడి నుంచి అటవీ మార్గంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు కూడా ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications