అన్నను గుర్తు చేసుకొని కంటతడి పెట్టిన అచ్చెన్న, అందరికీ ఆదర్శమని రామ్మోహన్

Posted By:
Subscribe to Oneindia Telugu

శ్రీకాకుళం: ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు గురువారం కంటతడి పెట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని తమ స్వగ్రామం నిమ్మాడలో ఎర్రన్నాయుడు వర్థంతి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రితో పాటు ఎంపీ రామ్మోహన్నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు. అనునిత్యం ప్రజలతో మమేకమై అలుపెరగని నాయకుడిగా జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేసిన ఎర్రన్న ఆశయాలు నెరవేర్చడమే తమ ప్రథమ కర్తవ్యమన్నారు.

 Athcannaidu weeps in Srikakulam

శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనేది తన సోదరుడు ఎర్రన్నాయుడు ఆకాంక్ష అని అచ్చేన్న చెప్పారు. ఇప్పటికే ప్రాధాన్యతా క్రమంలో సాగునీటిని అందిస్తున్నట్లు వెల్లడించారు. రానున్న రెండేళ్లలో ఆయన కలలు పూర్తిగా నెరవేరుస్తామన్నారు.

రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. స్వపక్షాలకు, ప్రతిపక్షాలకు తన తండ్రి ఎర్రన్నాయుడు ఆదర్శమని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంత కాలం శత్రువులు లేని వ్యక్తిగా ఆయన కొనసాగారని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Athcannaidu weeps in Srikakulam district on Thursday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి