'పవన్‌తో... మోడీ గురించి సింగపూర్‌లోనే కాదు, బాబు అన్ని దేశాల్లో చెప్తారు', రోజాకు నిమ్మల కౌంటర్

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెళ్లి సింగపూర్‌కు వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడుతారా అని బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావులు ఆదివారం కౌంటర్ ఇచ్చారు.

పటేల్ విగ్రహానికి 2500 కోట్లు, అమరావతికి 1500 కోట్లా?: మోడీకి బాబు, అమరావతికి సింగపూర్ 'తెలుగు' సాయం

2019 ఎన్నికల్లో ఏపీలో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వస్తాయని ఎద్దేవా చేశారు. విష్ణు కుమార్ రాజు.. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అంతేకాదు, విష్ణు కుమార్ రాజుకు బుద్ధా వెంకన్న ఓ సవాల్ కూడా విసిరారు.

విష్ణు బీజేపీ నుంచి పోటీ చేస్తానని ప్రమాణం చేస్తారా?

విష్ణు బీజేపీ నుంచి పోటీ చేస్తానని ప్రమాణం చేస్తారా?

విష్ణు కుమార్ రాజు 2019 ఎన్నికల్లో పార్టీ మారకుండా బీజేపీలోనే ఉండి పోటీ చేస్తారా చెప్పాలని బుద్ధా వెంకన్న సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన తన కుటుంబ సభ్యులపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు నమ్మక ద్రోహం చేసిన నరేంద్ర మోడీపై సింగపూర్‌లోనే కాదని, అన్ని దేశాల్లోను చంద్రబాబు మాట్లాడుతారని కౌంటర్ ఇచ్చారు.

 ప్రధాని వచ్చినా టీడీపీ ఓడిపోదు

ప్రధాని వచ్చినా టీడీపీ ఓడిపోదు

ఏపీకి బీజేపీ చేసిన అన్యాయాన్ని ప్రజలందరికీ వివరిస్తామని బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి వచ్చి ఇంటింటికి తిరిగినా టీడీపీ గెలుపును అడ్డుకోలేరని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పారు.

పవన్, జగన్‌లతో రాజకీయాలు

పవన్, జగన్‌లతో రాజకీయాలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిలను అడ్డు పెట్టుకొని బీజేపీ రాజకీయాలు చేయాలని చూస్తోందని బొండా ఉమామహేశ్వర రావు నిప్పులు చెరిగారు. ప్రజలు అన్నింటిని గమనిస్తున్నారని చెప్పారు. జగన్ తన కేసుల రాజీ కోసం బీజేపీతో అంటకాగుతున్నారన్నారు. వీటిని అన్నింటిని బయటపెడతామన్నారు. విజయ సాయి రెడ్డి లోపల ప్రధాని మోడీ కాళ్లు పట్టుకొని, బయటకు వచ్చి అవిశ్వాసం పెడుతున్నారన్నారు. ఈ నాలుగేళ్లలో ఏనాడైనా మోడీని నేరుగా, గట్టిగా విమర్శించారా అని ప్రశ్నించారు. బీజేపీ ఆడమన్నట్లు ఆడుతున్నారని, ఆ పార్టీకి పావుగా మారి, రాష్ట్రంపై విషం కక్కుతున్నారన్నారు.

చంద్రబాబు ఆరోగ్యం చూసుకోవాలని విష్ణు

చంద్రబాబు ఆరోగ్యం చూసుకోవాలని విష్ణు

కాగా, ఈ నెల 20వ తేదీన దీక్ష చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బీజేపీ శాసన సభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు ఓ సూచన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కేంద్రంలో చక్రం తిప్పుతుందన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అసలు టీడీపీకి వచ్చే ఎన్నికల్లో వేలు ఉంటే కదా అని, ఓడిపోతుందన్నారు.

రోజాకు నిమ్మల కిష్టప్ప కౌంటర్

రోజాకు నిమ్మల కిష్టప్ప కౌంటర్

ఏపీకి హోదా కోసం తాము రాజీనామా చేశామని, టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయడం లేదన్న వైసీపీ ఎమ్మెల్యే రోజాకు టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కౌంటర్ ఇచ్చారు. నాడు బోఫోర్స్ కుంభకోణం సమయంలో అవినీతి జరిగితే టీడీపీ ఎంపీలు రాజీనామా చేశారని, ఇప్పుడు అభివృద్ధి కోసం రాజీనామాలు ఎందుకన్నారు. నాడు బోఫోర్స్ కుంభకోణం సమయంలో రాజీనామా చేసిన టీడీపీ ఎంపీలు ఇప్పుడు ఎందుకు చేయడం లేదని రోజా అడగడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bharatiya Janata Party will not get votes in Andhra Pradesh, says TDP leaders Budha Venkanna and Bonda Uma.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X