ఏపీలో వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన చంద్రబాబు.. విధుల నుండి తొలగిస్తారా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేయాలని అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. వైద్య ఆరోగ్య రంగానికి పెద్దపీట వేస్తున్న ఏపీ సర్కార్ ఈ క్రమంలోనే సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. అనుమతి లేకుండా దీర్ఘకాలంగా విధులకు హాజరు కాని 62 మంది వైద్యులపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది.
ఆ వైద్యులకు షోకాజ్ నోటీసులు
వీరిలో 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్ లు ఉన్నారు. వీరంతా చాలా కాలంగా విధులకు రావటం లేదు. విధులకు గైర్హాజరుతో ఏడాదికి పైగా రాజకీయ పలుకుబడితో నెట్టుకొస్తున్న వైద్యుల సేవలను తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఈ మేరకు వారికి షోకాజ్ నోటీసులు పంపించారు.

ఎందుకు విధుల నుంచి తొలగించకూడదో చెప్పాలనినోటీసులు
వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, కొంతమంది రాజకీయ పలుకుబడి వల్ల వైద్య ఆరోగ్య శాఖలో ఈ పరిస్థితి నెలకొంది అన్న విమర్శలు ఉన్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దాలని భావించిన ప్రభుత్వం కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. సుదీర్ఘ కాలంగా విధులకు గైర్హాజర్ అవుతున్న సిబ్బందిని ఎందుకు విధుల నుంచి తొలగించకూడదో చెప్పాలని లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.
వివరణ కోరిన ప్రభుత్వం
ఈనెల 31వ తేదీలోపు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో వారి సేవలు రద్దు చేయబడతాయి అని స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, తిరుపతి, ఒంగోలు, అనంతపురం, కడపలో ఉన్న వివిధ ప్రభుత్వ, సిద్ధార్థ మెడికల్ కళాశాలలలో పలువురు డాక్టర్లు, ప్రొఫెసర్లు విధులకు హాజరు కావడం లేదు. కొందరు ఏడాదిగా విధులకు దూరంగా ఉంటే మరికొందరు రెండేళ్లు, మూడేళ్లు, ఇంకొందరైతే సుదీర్ఘకాలంగా కూడా విధులకు హాజరు కావడం లేదు.
షోకాజ్ నోటీసులకు ఏం సమాధానం ఇస్తారో
ఏళ్ల తరబడి విధులకు వీరు రాకుండా అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఏళ్ల తరబడి విధులకు రానివారు మరి షోకాజ్ నోటీసుల విషయంలో ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాల్సిందే.
-
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications