వైజాగ్ ఐటీకి బిగ్ డే.. ! కాగ్నిజెంట్ సహా 8 సంస్థలకు పునాది..!
ఏపీలో ఐటీ రంగం రాకకు ఇవాళ కీలక అడుగు పడింది. విశాఖపట్నం వేదికగా ఏకంగా 8 ఐటీ సంస్థల నిర్మాణాలకు సీఎం చంద్రబాబు ఇవాళ శంఖుస్థాపన చేశారు. ఇందులో అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సహా ఇతర సంస్థలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ శాశ్వత కార్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్ సహా అధికారులు, ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశాఖలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ ఇవాళ శంకుస్థాపన చేశారు. 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో ఈ క్యాంపస్ నిర్మాణం జరగనుంది. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ నిర్మాణం పూర్తి కానుంది. ఇందులో 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనుంది. అప్పటివరకు అద్దె కార్యాలయంలో కార్యకాలాపాలు కొనసాగించనుంది.

కాగ్నిజెంట్ ప్రధానంగా ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజినీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టిసారించనుంది. కాగ్నిజెంట్‌తో పాటు మరో 8 ఐటీ సంస్థలకు కూడా విశాఖలో క్యాంపస్‌లు ఏర్పాటుకు భూమిపూజ చేశారు. కాగ్నిజెంట్ తో పాటు ఇవాళ భూమిపూజ చేసిన ఇతర సంస్థల్లో టెక్ తమ్మిన, సత్వ డెవలపర్స్, ఇమాజిన్నోవేట్ టెక్ సొల్యూషన్స్ ఇండియా, ఫ్లూయెంట్ గ్రిడ్ లిమిటెడ్, మదర్సన్ టెక్నాలజీస్, క్వార్క్స్ టెక్నోసాఫ్ట్, ఏసీఎన్ హెల్త్ కేర్ ఆర్సీఎం సర్వీసెస్, నాన్రెల్ టెక్నాలజీస్ సంస్థలు ఉన్నాయి.

ఈ సంస్థల ద్వారా రాష్ట్రానికి రూ.3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. గూగుల్ రాకతో ఇప్పటికే డేటా సిటీగా ఎదుగుతున్న విశాఖలో కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి సంస్థలు కూడా రావడంతో నగరంవైపు ప్రముఖ ఐటీ కంపెనీల చూపు పడబోతోంది. ప్రస్తుతం విశాఖలో 150కి పైగా టెక్ కంపెనీల కార్యకలాపాలు సాగుతున్నాయి. దీంతో రాష్ట్రంలో ఐటీ నిపుణులకు అవకాశాలు విస్తృతంగా పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ 18 నెలల్లో ఒక్క విశాఖలోనే రూ.1.34 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు వచ్చాయి.
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications