తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!
తిరుమలలో భక్తులు సీఎం చంద్రబాబుకు కీలక రిక్వెస్ట్ చేసారు. దీనికి వెంటనే చంద్రబాబు స్పందించారు. భక్తులకు హామీ ఇవ్వటంతో పాటుగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. తిరుమల పర్యటనలో భాగంగా చంద్రబాబు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత తరిగొండ వెంగమాంబ సత్రంలో అన్నదానంలో పాల్గొన్నారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఒక్క రోజు కు పూర్తిగా అన్నదాన ఖర్చుకు అవసరమైన మొత్తం టీటీడీకి విరాళంగా అందించారు.
దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని మరింత తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు ఈ సందర్భంగా సీఎంను కోరారు. భక్తుల విజ్ఞప్తిపై స్పందించిన చంద్రబాబు, శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వినియో గించబోతున్నామని వెల్లడించారు. టెక్నాలజీ సాయంతో క్యూ లైన్ల నిర్వహణను క్రమబద్ధీకరించి, భక్తులకు తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం కలిగేలా టీటీడీ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. భక్తుల భద్రత, సౌకర్యాల పర్యవేక్షణ కోసం తిరుమలలో ఏర్పాటు చేసిన 'ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్' ప్రాధాన్యతను సీఎం వివరించారు. పారిశుద్ధ్యం నుంచి భద్రత వరకు ప్రతి అంశాన్ని ఈ వ్యవస్థ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడటమే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు.

నాణ్యత పరిశీలన కొత్తగా అందుబాటులోకి లాబ్
ఆ తరువాత తిరుమలలో అత్యాధునిక ఫుడ్ అనాలిసిస్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ ల్యాబ్ లో నీరు, ఆహారపదార్థాలు, ముడి సరకుల నాణ్యతపై పరీక్షలు చేయనున్నారు. 12 వేల చదరపు అడుగుల్లో రెండంతస్తుల్లో వాటర్ అండ్ ఫుడ్ అనాలసిస్ లేబరేటరీ నిర్మాణం చేసారు. రూ.20 కోట్లతో అత్యంత ఆధునిక యంత్రాలతో కూడిన లేబొరేటరీ లో అత్యాధునిక సాంకేతికతకు అనుగుణంగా ఈ-టంగ్ (e-tongue), ఈ-నోస్ (e-nose) వ్యవస్థలతో పాటు, నీరు మరియు ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించే అధునాతన పరికరాలు ఉన్నాయి. శ్రీవారి ప్రసాదాల్లో వాడే నెయ్యి, పాలు, ఇతర పదార్థాల నాణ్యతను ఈ ల్యాబ్ ద్వారా కఠినంగా పరీక్షించి నాణ్యతను పెంచనున్నారు. అపవిత్రతలను గుర్తించేందుకు (parts per trillion స్థాయిలో) ఈ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ఉపయోగపడుతుందని, టిటిడి (TTD) ఆహార సరఫరాలో పారదర్శకతను పెంచుతుందని అధికారులు వివరించారు. తిరుమలలో అందుతున్న సేవల గురించి చంద్రబాబు భక్తులను అడిగి తెలుసుకున్నారు.
-
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
జగన్ 'మావిగన్' ప్రతిపాదన వెనుక, కూటమి నేతలకు చంద్రబాబు కీలక పిలుపు..!! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య గమనిక -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు













Click it and Unblock the Notifications