అయోధ్య రాముడి సేవలో చంద్రబాబు..! యోగీ సర్కార్ పై ప్రశంసలు..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యలో ఉన్న రామాలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అయోధ్య రామాలయంతో పాటు స్థానికంగా ఉన్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంపైనా ప్రశంసల జల్లు కురిపించారు. అయోధ్యలో శ్రీరామదర్శనం తనకు కొత్త శక్తి ఇచ్చినట్లు అనంతరం చంద్రబాబు ఎక్స్ లో ట్వీట్ కూడా చేశారు.
సుపరిపాలనకు రామరాజ్యమే బెంచ్ మార్క్ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంచి పరిపాలనను రామరాజ్యంతోనే పోల్చుకుంటామని తెలిపారు. ఇవాల అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అత్యుత్తమ పాలనకు రాముడి పాలనే కొలమానంగా తీసుకుంటామని చంద్రబాబు తెలిపారు. అయోధ్యలో నిర్మించిన రామమందిరం మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఎన్నో వివాదాల అనంతరం ఆలయం నిర్మితమై దేశ ప్రజల కల సాకారమైందన్నారు.

Today, I was blessed to have darshan and offer prayers at the divine and magnificent Shri Ram Janmabhoomi Mandir in Ayodhya. It was a peaceful and spiritually uplifting experience to be here once again. Lord Shri Ram’s values and ideals are timeless lessons for us all. May they… pic.twitter.com/jM8ZMk8Cz3
— N Chandrababu Naidu (@ncbn) December 28, 2025
భారత్‌లో ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య రామాలయం మారిందని చంద్రబాబు తెలిపారు. ఆలయ నిర్మాణంతో పాటు యూపీలో సుపరిపాలన అందిస్తున్న యోగీ ఆదిత్య నాథ్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. దేశంలోని ఇతర దేవాలయాలకు అయోధ్య రామాలయం మార్గదర్శకంగా నిలవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. సాంకేతికంగా ముందుడుగు వేస్తున్న భారత్‌ను ఎవరూ నిలువరించలేరని స్పష్టం చేశారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యంలో యూపీ, బీహార్లు కూడా కీలక పాత్ర పోషించాలని అన్నారు. శ్రీ రాముడి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్‌లో స్పందించారు. 'శ్రీ రాముడు పాటించిన విలువలు కాలానికి అతీతంగా ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంటాయి. రాముడు పాటించిన విలువలు సుపరిపాలనకు నిరంతరం మార్గదర్శంగా నిలుస్తాయి. అయోధ్యలో శ్రీరామ దర్శనం నాకు నూతన శక్తిని ఇచ్చింది' అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications