ఏపీలో కరోనా : తాజాగా 1539 కేసులు, 12 మరణాలు ; ఆ జిల్లాలో అధికంగా కేసులు !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు వెయ్యికి పైగానే నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 1539 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తాజాగా నమోదైన కరోనా కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 20,07,730 గా ఉంది. ఇక నిన్న నమోదైన 12 మరణాలతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్య 13,778 గా నమోదయింది.

గత 24 గంటల వ్యవధిలో కోలుకున్న వారు 1140 మంది
గత 24 గంటల వ్యవధిలో 1140 మంది కరోనా మహమ్మారి బారినుండి కోలుకున్నారు. దీంతో మొత్తంగా రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,79,504 కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,448 గా నమోదయింది. ఇక గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 67,590 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2,63,37,946 నమూనాలను పరీక్షించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలను చూస్తే

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు
ఈరోజు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 243 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో తూర్పుగోదావరి లో 228 కరోనా కేసులు, కృష్ణాజిల్లాలో 194 కరోనా కేసులు, నెల్లూరు జిల్లాలో 176 కరోనా కేసులు, పశ్చిమగోదావరి జిల్లాలో 163 కరోనా కేసులు, గుంటూరు జిల్లాలో 127 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత విశాఖపట్నంలో 92 కరోనా కేసులు వైఎస్ఆర్ కడప జిల్లాలో 80 కరోనా కేసులు విజయనగరంలో 54 కరోనా కేసులు, అనంతపూర్ జిల్లాలో 26 కరోనా కేసులు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాలో 15 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

ఏపీ స్కూల్స్ లో నిత్యం నమోదవుతున్న కరోనా కేసులు
ఇదిలా ఉంటే కరోనా కట్టడికి అధికారులు కఠిన నిబంధనలు అమలు చెయ్యాలని, నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం స్కూళ్ళు కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. నిత్యం రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒక జిల్లాలో స్కూల్స్ లో కరోనా కేసులు నమోదు అవుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ రోజు విశాఖపట్నంలో ఒక స్కూల్ లో ఆరుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. స్కూల్స్ లో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.

కరోనా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు
ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై సమీక్షించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు మాస్కులు ధరించాలని, సామాజిక దూరమా పాటించాలని సూచించారు. మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడటానికి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక తాజాగా రికవరీ రేటు 98.63% గా ఉన్నప్పటికీ, వీక్లీ పాజిటివిటీ రేటు 2.07 శాతంగా ఉందని గణాంకాలు అంకెలతో సంబంధం లేకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించకపోతే కఠినంగా వ్యవహరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications