త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!
శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుభవార్త చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నుంచి కేంద్రమంత్రి అయిన కింజారపు రామ్మోహన్ నాయుడు జిల్లాను పురోగతి మార్గంలో ప్రయాణం చేసేలా అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్రకు వరప్రదాయినిగా భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరుండి మరి నిర్మాణం చేయిస్తున్న కేంద్ర మంత్రి శ్రీకాకుళం జిల్లాకు రవాణాసౌకర్యాలు మెరుగుపడితే పారిశ్రామికంగా పురోగతి మార్గంలో ప్రయాణం చేస్తుందని భావిస్తున్నారు.
మూడు రైల్వే హాల్ట్ లను ప్రారంభించిన కేంద్రమంత్రి
ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాకు నడుస్తున్న రైళ్ల విషయంలో కూడా ఆయన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు. హరిశ్చంద్రపురం వద్ద గుణ పూర్ విశాఖ ఎక్స్ప్రెస్, పాతపట్నం వద్ద రాజ్యరాణి ఎక్స్ప్రెస్, మందస వద్ద బ్రహ్మ పురం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైళ్లకు కొత్త రైల్వే హాల్ట్ లను ప్రారంభించారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.

శ్రీకాకుళం నుండి తిరుపతి, హైదరాబాద్ లకు నేరుగా వెళ్లేలా రైళ్ళు
జిల్లా రైల్వే రంగ అభివృద్ధిలో ఆరు రైల్వే హాల్ట్ లకు 45 రోజుల స్వల్ప వ్యవధిలో అనుమతి లభించడం గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో మరో శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం నుండి తిరుపతి, హైదరాబాద్ లకు నేరుగా వెళ్లేలా రైళ్లను నడిపేందుకు కృషి చేస్తానంటూ వెల్లడించారు.
తిరుపతి, హైదరాబాద్ లకు నేరుగా రైళ్ళు.. కీలక అడుగు పడిందన్నమంత్రి
తిరుపతి, హైదరాబాద్ కు నేరుగా రైళ్ళు కావాలనే డిమాండ్ ఎంతో కాలంగా జిల్లా వాసుల నుండి వినిపిస్తుంది. ఇప్పటికే ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువెళ్లాలని, ప్రస్తుతం దీనిపైన సర్వే కొనసాగుతోందని ఆయన శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వెనుకబాటుకు గురైన శ్రీకాకుళం జిల్లాను అన్ని రంగాలలోనూ ముందుకు తీసుకు వెళ్లడానికి కూటమి ప్రభుత్వ హయాంలో కృషి జరుగుతుందన్నారు.
జిల్లాను అగ్రభాగంలో నిలిపేలా కృషి చేస్తానన్న కేంద్రమంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావలసిన మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రత్యేక దృష్టిని సారించి చర్యలు చేపడుతుందని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏపీ పైన వరాలజల్లు కురిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని ప్రయోజనం కలిగించే ప్రాజెక్టులను శ్రీకాకుళం జిల్లాకు తీసుకువచ్చి, జిల్లాను అగ్రభాగంలో నిలిపేలా కృషి చేస్తానని ఆయన జిల్లా వాసులకు శుభవార్త చెప్పారు.
-
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
Charminar Express: చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్-రూట్ మార్పు..! -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications