కడప నుండి బెంగళూరుకు కొత్త రైల్వే లైన్.. ఆ ప్రాంతాలలో ప్రగతి పరుగులే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రవాణా వ్యవస్థ పైన ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా రైల్వే వ్యవస్థను పురోగతి బాట పట్టిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రతి చోట రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుంది. కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా సహకారాన్ని అందిస్తున్న క్రమంలో ఏపీలో రైల్వే ప్రగతి పరుగులు పెడుతోంది. తాజాగా మరో శుభవార్త చెప్పింది ఏపీ ప్రభుత్వం.
దక్షిణ భారత రైల్వే నెట్వర్క్ లో కీలక ప్రతిపాదిత లైన్
కడప నుండి బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఊరట కలిగించేలా ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు కొత్త రైల్వేలైను ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత పరిస్థితి ఈ మార్గంలో కడప బెంగళూరు ప్రయాణం ఎక్కువ సమయం తీసుకుంటూ, ట్రాఫిక్ భారానికి మరియు ఖర్చు పెరుగుదలకు కారణమవుతోంది. ఈ క్రమంలోనే ప్రతిపాదిత ముద్దనూరు ముదిగుబ్బ రైల్వే లైను దక్షిణ భారత రైల్వే నెట్వర్క్ లో ఒక వ్యూహాత్మకమైన మార్పుకు కారణం కాబోతుంది.

ఈ రైల్వే లైన్ తో కడప, అనంతపురం, బెంగళూరుకు బెనిఫిట్
ఈ కొత్త రైల్వే మార్గం ప్రారంభమైతే కడప జిల్లా నుంచి అనంతపురం మీదుగా బెంగళూరుకు నేరుగా రైలు కనెక్టివిటీ మెరుగుపడుతుంది. ప్రస్తుతం ఉన్న మార్గాలతో పోల్చినట్లయితే ప్రయాణ దూరం తగ్గడం మాత్రమే కాకుండా సమయం కూడా ఆదా అవుతుంది. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు ఐటీ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ రైలు మార్గంతో ఈ ఉపయోగాలు, ఉపాధి కూడా
ముద్దనూరు ముదిగుబ్బ రైల్వే లైన్ ద్వారా ప్రాంతీయ అభివృద్ధికి కూడా అవకాశం ఉంది. ఈ రైల్వే లైన్ ద్వారా రైలు సౌకర్యం పెరగడంతో పాటు పరిశ్రమలు, గోదాములు, లాజిస్టిక్ కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉంది. దీని కారణంగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం కూడా ఉంది. వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేయడానికి కూడా ఈ మార్గం ఉపయోగపడుతుంది.
దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధికి కీలకం కానున్న రైల్వే లైన్
పర్యాటకం గాను ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. కడప జిల్లాలో ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లడానికి బెంగళూరు మహానగరానికి సులభంగా చేరుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. ఈ కొత్త రైల్వే లైను కడప బెంగళూరు మధ్య ప్రయాణ భారాన్ని తగ్గించడమే కాకుండా దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధికి కొత్త దిశను చూపిస్తుంది
-
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
ఒంటిమిట్ట కోదండ రామస్వామి కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..!












Click it and Unblock the Notifications