ఏపీ సంక్రాంతి సంబరాలు: కోడిపందాలకు హైటెక్ బరులు, ఆహ్వాన పత్రికలు!
ఏపీలో సంక్రాంతి సంబరాలకు రంగం సిద్ధమైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే కోడిపందాలు హైటెక్ రూపును సంతరించుకుంటున్నాయి. వేలకోట్ల రూపాయల కోడిపందాలు ప్రతి సంవత్సరం ఏపీలో జరుగుతున్నాయి. క్రాస్ బ్రీడ్ కోడిపుంజుల తో జరిగే ఈ కోడిపందాలకు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో బరులు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలలో కోడి పందాల కోసం భారీ బరులు రెడీ అవుతున్నాయి.
భారీ స్థాయిలో కోడి పందేల నిర్వహణ
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నూజివీడు గన్నవరం సరిహద్దు ప్రాంతాల్లో భారీ స్థాయిలో కోడి పందేల నిర్వహణకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 28 ఎకరాల విస్తీర్ణంలో హైటెక్ బరులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏర్పాట్లకు కోట్ల రూపాయల మేర ఖర్చు చేసినట్లు స్థానికంగా చర్చ సాగుతోంది.

కోడి పందేలు నిర్వహించేందుకు హైటెక్ బరులు
ఈ నెల 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిరంతరాయంగా కోడి పందేలు నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని పలువురు ప్రముఖులకు కోడిపందాలను నిర్వహిస్తున్నట్టు, వారంతా తప్పనిసరిగా రావాలని ఆహ్వానపత్రికలు పంపినట్లు తెలుస్తోంది. కోళ్ళ పందేలు జరిగే ప్రాంతాల్లో అత్యంత రహస్యంగా ఏర్పాట్లు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
పందేలు జరిగే చోట ప్రత్యేక గ్యాలరీలు, విశ్రాంతి గదులు, పార్కింగ్
వీఐపీల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లను కూడా భారీగా చేస్తున్నారు. నూజివీడు గన్నవరం సరిహద్దు ప్రాంతంలో ఏర్పాట్లు చేస్తున్న బరుల వద్ద సుమారు 80 మంది బౌన్సర్లను ప్రత్యేకంగా నియమించినట్లు సమాచారం. పందేలు జరిగే ప్రదేశాల్లో ప్రత్యేక గ్యాలరీలు, విశ్రాంతి గదులు, పార్కింగ్ సదుపాయాలతో పాటు ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
కోడి పందేలపై భారీ బహుమతులు
రోజువారీగా కోట్ల రూపాయల విలువైన పందేలు జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిర్వాహకులు విజేతలకు భారీ బహుమతులు ప్రకటించడంతో ఈ పందేలపై పెద్ద ఎత్తున ఆసక్తి పెరుగుతోంది. ఒక్క ఏపీ నుంచే కాకుండా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పందేల్లో విజయం సాధించిన వారికి బ్రెజా, థార్ వంటి కార్లను బహుమతులుగా ప్రకటించినట్లు సమాచారం.
కోడి పందేలపై చర్యలు కష్టమేనా?
ఇదిలా ఉండగా, కోడి పందేలు చట్ట విరుద్ధమని ఇప్పటికే పలుమార్లు అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. అయినప్పటికీ ప్రతి ఏటా సంక్రాంతి సమీపించగానే ఈ తరహా కార్యక్రమాలు తెరపైకి రావడం గమనార్హం. ఈ వ్యవహారంపై పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పందేలు జరగకుండా చర్యలు తీసుకుంటారా, లేక పర్యవేక్షణతో పరిమితం అవుతారా అన్నది వేచి చూడాల్సి ఉంది.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications