సీఎంకు కూడా విషయం తెలుసు! సంచలన విషయాలు బట్టబయలు
రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Jana Sena MLA Arava Sreedhar)లైంగిక వేధింపుల ఆరోపణలు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ కేసులో బాధితురాలిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి వీణ, తన న్యాయవాదితో కలిసి మీడియా ముందుకు రావడంతో హీట్ మరింత ఎక్కువైంది. ఎమ్మెల్యే తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన జీవితాన్ని ఎలా నాశనం చేశాడో ఆమె కన్నీళ్లతో వివరించగా, ఈ వ్యవహారం రాజకీయంగా కొత్త మలుపు తీసుకుంది.
మీడియా సమావేశంలో వీణ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వివాదానికి నాంది 2024 జూన్ 14న పడింది. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఎమ్మెల్యే శ్రీధర్ తొలుత మర్యాదపూర్వకంగా వ్యవహరించినప్పటికీ, క్రమంగా వ్యక్తిగత వివరాలు తెలుసుకుని తన అసలు ఉద్దేశాన్ని బయటపెట్టాడని ఆమె ఆరోపించారు. తన అధికార ప్రభావాన్ని చూపుతూ దగ్గరవ్వాలని ఒత్తిడి చేశారని, కలవడానికి నిరాకరిస్తే ఉద్యోగ ప్రమోషన్లు, బదిలీలను అడ్డుకుంటానని బెదిరించారని తెలిపారు.

ఆ సమయంలో జుట్టు పట్టుకుని లాగుతూ..
ఈ వ్యవహారం జూలై 9న అత్యంత దారుణ మలుపు తిరిగిందని వీణ వాపోయారు. బలవంతంగా కారులో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, ఆ సమయంలో జుట్టు పట్టుకుని లాగుతూ అమానుషంగా ప్రవర్తించాడని మీడియాకు వెల్లడించారు. ఈ విషయం బయటపెడితే తన మూడేళ్ల కుమారుడికి హాని చేస్తానని బెదిరించారని ఆరోపించారు. మార్నింగ్ షెడ్యూల్స్ తో బిజీగా ఉండటం వల్లే ఎమ్మెల్యే శ్రీధర్ ను రాత్రిళ్లు కలిశానని తెలిపారు. తన ఇంటికి వచ్చి కారును పార్కింగ్ లోనే పెట్టేవారని, తలుపు తీయకపోతే.. ఎమ్మెల్యే అని కూడా మరిచిపోయి ఇంటి బయట నిలబడే వారని చెప్పారు. ఫోన్ లిఫ్ట్ చేసే వరకు ఇంటి బయటే వెయిట్ చేసే వారని వెల్లడించారు.
ఇదే క్రమంలో తాను గర్భవతిని కూడా అయ్యానని, అయితే ఎమ్మెల్యే అబార్షన్ చేయించుకోవాలని తీవ్ర ఒత్తిడి తెచ్చాడని వీణ సంచలన విషయాన్ని బయటపెట్టారు. అంగీకరించకపోతే ఇంటికి వచ్చి కొట్టాడని, తన భర్తకు విడాకులు ఇప్పిస్తే పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరకు అబార్షన్ చేయించాడని తెలిపారు. అప్పటికే అనుమానం కలగడంతో టెలిగ్రామ్ వంటి యాప్‌లలో ఆధారాలను దాచుకున్నానని చెప్పారు.
రూ.7 లక్షలు అప్పుగా ఇచ్చా..
2026 జనవరి 7న ఈ వ్యవహారం పూర్తిగా బహిర్గతమైందని వీణ పేర్కొన్నారు. పెళ్లి చేసుకోనని ముఖం చాటేయడమే కాకుండా, తన భర్తకు ఫోన్ చేసి విడాకులు తీసుకోవాలని బెదిరించాడని ఆరోపించారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులే తనను దూరం పెట్టారని, తన బిడ్డను కూడా తన వద్ద ఉండనివ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఎమ్మెల్యేకు రూ.7 లక్షలు అప్పుగా ఇచ్చిన విషయాన్ని కూడా వెల్లడిస్తూ.. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా తనను వాడుకుని వదిలేశాడని మండిపడ్డారు.
సీఎంకు కూడా విషయం చెప్పా..
ఎమ్మెల్యే శ్రీధర్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను, వ్యవస్థను ప్రభావితం చేస్తూ న్యాయాన్ని దూరం చేస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు. తనకు న్యాయం జరగకుండా చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని వాపోయారు. తాను తిరుపతి ఎస్పీ కార్యాలయంలో కంప్లైంట్ ఇస్తే ఇప్పటివరకు తీసుకోలేదని.. సంక్రాంతికి నారావారి పల్లె వచ్చినప్పుడు సీఎం చంద్రబాబుకు కూడా ఈ విషయం వివరంగా చెప్పానని సంచలన విషయాన్నిబయటపెట్టారు. న్యాయం కోసం తన వీడియోలను తానే సోషల్ మీడియాకు లీక్ చేశా అని స్పష్టం చేశారు.
ఇది ఒక మహిళా ఉద్యోగి ఆత్మగౌరవానికి సంబంధించిన పోరాటమని, చట్టం ముందు ఎమ్మెల్యేను నిలబెట్టాలని డిమాండ్ చేశారు. తనకు భద్రత కల్పించాలని, తన కుమారుడిని తన వద్దకు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. డీప్ ఫేక్ వీడియోలంటూ ఎమ్మెల్యే చేస్తున్న వాదనలు తప్పించుకునే ప్రయత్నమేనని వీణ స్పష్టం చేశారు. ఫోరెన్సిక్ పరీక్షల్లో నిజాలు బయటకు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వీణ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ఈ కేసులో న్యాయపోరాటానికి పూర్తిగా సిద్ధమని ప్రకటించారు. ఇప్పటికే ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు, ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్‌ను కూడా ఆశ్రయించినట్లు వెల్లడించారు. బాధితురాలి వద్ద ఉన్న ఆధారాలు ఏఐ సృష్టించినవి కావని, ఫోరెన్సిక్ పరీక్షలకు పూర్తిగా నిలబడతాయని స్పష్టం చేశారు. ఇది రాజకీయంగా ప్రేరేపిత వ్యవహారం కాదని, ఒక మహిళకు న్యాయం చేయాలనే బాధ్యతతోనే ముందుకు వచ్చామని ఆయన తెలిపారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications