కిరాతకం: ల్యాప్ టాప్ పాడు చేశాడంటూ కడప వాసికి సౌదీలో చిత్రహింసలు

Posted By:
Subscribe to Oneindia Telugu

కడప: ల్యాప్ టాప్ పాడు చేశాడనే అభియోగం మోపి కారు డ్రైవర్ గా పనిచేస్తోన్న భాషా అనే వ్యక్తిని సౌదీ అరేబియాలో యజమాని తీవ్రంగా వేధిస్తున్నాడు. ఈ బాధలు భరించలేని బాధితుడు తనను రక్షించాలని కోరుతూ ఓ వీడియో సందేశాన్ని పంపాడు.

వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందులకు చెందిన లవంగిరి అన్వర్ బాషా ఏడాది క్రితం సౌదీ అరేబియాలో పనిచేసేందుకు వెళ్ళాడు. సౌదీలోని మదీనా వద్ద ఓ వ్యక్తి వద్ద కారు డ్రైవర్ గా జాయిన్ అయ్యాడు.

Kadapa man's SOS from Saudi hellhole

తన యజమాని పెట్టే బాధలకు ఆయన అనారోగ్యం పాలయ్యాడు. ఈ మేరకు తనకు సహయం చేయాలని కోరుతూ ఆయన ఈ ఏడాది మార్చి 12వ, తేదిన రహస్యంగా చిత్రీకరించిన వీడియోను మీడియాకు పంపాడు.

ఈ విషయమై తనకు సహయం చేయాలని ఆయన కార్మిక శాఖ అధికారులతో పాటు సోషల్ డెవలప్ మెంట్ అధికారులతో మాట్లాడిన సంబాషణను కూడ ఆయన పంపాడు.

అయితే బాషా వినతిపై అధికారులు సానుకూలంగా స్పందించలేదు.అయితే వారు పోలీసులను ఆశ్రయించాలని కోరారు.అయితే పోలీసులు, కార్మికశాఖ అధికారులు ఆయనకు సహయం చేసేందుకు నిరాకరించారు. దీంతో బాషా తన బాధను రికార్డు చేసి మీడియాకు పంపాడు.

సౌదీలో బాషాకు ఖలేద్ అహ్మద్ అనే వ్యక్తి ఉద్యోగం ఇచ్చాడు. అయితే బాషాకు చెందిన డ్యాక్యుమెంట్లను ఖలేద్ కాల్చివేశాడని బాషా చెప్పాడు. ల్యాప్ టాప్ ను పాడు చేశారనే కోపంతోనే తనపై తన యజమాని ప్రజల మద్యే దాడి చేశాడని ఆయన చెప్పాడు.

అహ్మద్ సతీమణిని మదరసా వద్ద దింపి రావడమే ప్రతి రోజు తన దినచర్య అని ఆయన చెప్పాడు.అయితే ఓ రోజు ల్యాప్ టాప్ ను తాను డ్యామేజ్ చేశానని ఆమె తిట్టిందని, ఈ విషయమై భర్తకు చెప్పడంతో ఆయన చిత్రహింసలు పెట్టాడని బాధితుడు చెప్పాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Pushed, punched, kicked, slapped, abused and threatened by his kafil (employer) in Saudi Arabia, an Indian from Andhra Pradesh is screaming for help. Lavangiri Ansar Basha, 25, from Pulivendula in YSR Kadapa district has been working as a driver for a year at Madina and is desperate to return to India, unable to bear the trauma.
Please Wait while comments are loading...