Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రేవంత్ దూకుడు అడ్డుకోండి..! చంద్రబాబుకు జగన్ లేఖ..!

ఏపీ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యతను దెబ్బతీస్తున్న అంశాల్లో జల వివాదాలు కూడా ఒకటి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకం, సరిహద్దు సమస్యలు ఇలా చాలా సమస్యలు తలెత్తున్నాయి. వీటిలో తాజాగా కృష్ణాజలాల వాడకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన నేపథ్యంలో ఏపీ కూడా తన వాదన వినిపించేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ ఓ లేఖ రాశారు.

కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్ ముందు జరిగే విచారణలో ఏపీ ప్రభుత్వం తన వాదనను వినిపించే అవకాశం ఉంటుందని, తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీల నీటిని కేటాయించాలనే తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమైనదని జగన్ తెలిపారు. ట్రిబ్యునల్ ఈ అభ్యర్థనను అంగీకరిస్తే, ఏపీకి తీవ్ర అన్యాయం తప్పదన్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పుడుట్రైబ్యునల్ ముందు తన తుది వాదనలను సమర్పించి అన్యాయమైన పునర్విభజనను నిరోధించాలని జగన్ కోరారు.

Krishna Water Row YS Jagan Asks CM Chandrababu to Block Telangana s 763 TMC Allocation

రాయలసీమ ప్రాజెక్టుల పట్ల టీడీపీ నిర్లక్ష్య వైఖరిని బాబుకు రాసిన లేఖలో జగన్ గుర్తుచేశారు. 1996లో చంద్రబాబు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా కూడా ఉన్నప్పుడే ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 519.6 మీటర్ల నుండి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఆ సమయంలో ఏపీలో ప్రతిపక్ష పార్టీలు, రైతులు ఈ పరిణామం ఉమ్మడి ఏపీ హక్కులను తీవ్రంగా దెబ్బతీస్తుందని ఆందోళనలు చేసినా చంద్రబాబు పెడచెవిన పెట్టారన్నారు. టిడిపి ప్రభుత్వ వైఖరి కారణంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచడానికి కర్ణాటకకు అనుమతి ఇచ్చిందన్నారు.

Krishna Water Row YS Jagan Asks CM Chandrababu to Block Telangana s 763 TMC Allocation

అలాగే 2014లో ఏర్పడిన టిడిపి ప్రభుత్వం కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర హక్కుల్ని కూడా తెలంగాణకు వదులుకుందన్నారు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కుంటోందని జగన్ ఆరోపించారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలన్నారు. ఈ కీలక సమయంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రం పట్ల నిబద్ధతతో వ్యవహరించి, కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడాలని జగన్ కోరారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టిఎంసి నికర నీటిలో ఒక టిఎంసి అయినా కోల్పోయే పరిస్థితి తలెత్తినా, దానికి టిడిపి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+