వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి పాలనకు కుట్ర, ఎవరో తెలుసు: లగడపాటి

By Pratap
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
న్యూఢిల్లీ: తెలంగాణ కోసం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తేవడానికి కొంత మంది కుట్ర చేస్తున్నారని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు. కుట్ర చేస్తున్నవారు వేర్పాటువాదులేనని ఆయన శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వారు ఎవరో అందరికీ తెలుసునని, వారి పేర్లు తాను చెప్పబోనని ఆయన అన్నారు. శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదింపజేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది ఎవరో తెలుసునని ఆయన అన్నారు.

శాసనసభ్యులు రాజీనామాలు చేస్తే సమైక్యాంధ్ర ప్రభుత్వం కూలిపోతుందని, అలా ప్రభుత్వాన్ని కూల్చి రాష్ట్రపతి పాలన వచ్చేలా చూడాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. సమైక్య ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కొంత మంది కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. తమ మ్యానిఫెస్టో రోశయ్య కమిటీయేనని ఆయన అన్నారు. శాసనసభా సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తే సమైక్యాంధ్రకు ద్రోహం చేసినట్లేనని ఆయన అన్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఎంత కడుపు మంట ఉందో ఈ రోజు అందరికీ తెలిసి వచ్చిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. నీళ్లు, ఉద్యోగాల సమస్యల గురించి ముఖ్యమంత్రి మాట్లాడారని ఆయన చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డికన్నా మించిన సమైక్యవాది మరొకరు లేరని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలను ముఖ్యమంత్రి చెప్పారని, తెలుగుజాతికి చీడ పురుగులు ముఖ్యమంత్రిని తప్పు పడుతున్నాయని ఆయన అన్నారు ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రయత్నాలు చేసేవారంతా వేర్పాటువాదులేనని ఆయన అన్నారు.

ప్రజలతో మమైకమై సమైక్యాంధ్ర ఉద్యమం చేయడానికే తాము రాజీనామాలు చేశామని ఆయన చెప్పారు. సిడబ్ల్యుసి నిర్ణయం వచ్చినప్పటి నుంచి తాము పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం విషయంలో దిగ్విజయ్ సింగ్‌ను తప్పు దోవ పట్టించారని ఆయన అన్నారు. విభజనకు నిర్ణయం తీసుకుంటే ప్రతి జిల్లా భగ్గుమంటుందని చిరంజీవి దిగ్విజయ్ సింగ్‌కు చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు.

English summary
Congress Vijayawada MP Lagadapati Rajagopal alleged that few people are conspiring against CM Kiran kumar Reddy's government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X