జగన్‌పై మండిపడ్డ సునీత, చాంబర్లోకి నీళ్లుపై వీటికి జవాబు చెప్పాలని..

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర అమరావతిలోని నూతన అసెంబ్లీలో జగన్ చాంబర్లోకి నీళ్లు రావడంపై మాటల యుద్ధం నడుస్తోంది.

చదవండి: ఆఫీస్‌లోకి నీళ్లు: విద్యుత్ షాక్ ట్విస్ట్, జగన్ ప్రాణాలకే ప్రమాదమని..

తాజాగా, పరిటాల సునీత ప్రతిపక్ష నేతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపికి చెందిన వారే పైపులు కోశారని, తద్వారా జగన్ చాంబర్లో నీళ్లు లోపల పడేలా చేశారని ఆరోపించారు. ఒక్క జగన్ కార్యాలయంలోకి మాత్రమే నీళ్లు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, టిడిపి నేతలు కూడా అదే చెబుతున్నారు.

వీటికి సమాధానం ఏమిటి?

వీటికి సమాధానం ఏమిటి?

అయితే, వైయస్సార్ కాంగ్రస్ పార్టీ నేతలు, జగన్ అభిమానులు మరోలా స్పందిస్తున్నారు. ఒక్క జగన్ కార్యాలయంలోకి మాత్రమే నీళ్లు వచ్చాయనేది అవాస్తవం అంటున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు నీటిలో ఉండలేక ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నారు. గోడ పెచ్చులు ఎందుకు ఊడాయో చెప్పాలంటున్నారు.

సునీతకు కౌంటర్

సునీతకు కౌంటర్

అంతేకాకుండా, మీడియాను తొలుత లోపలకు రానివ్వలేదని గుర్తు చేస్తున్నారు. ఆ సమయంలో నీటిని ట్యాంకుల ద్వారా తోడారని, దానికి ఏం సమాధానం చెబుతారని అంటున్నారు. జగన్, ఎమ్మెల్యేలు కలిసి స్లాబుకు చిల్లులు పెట్టారని పరిటాల సునీత చెప్పడం విడ్డూరం అంటున్నారు.

నిజాలేమిటో తేల్చాలని..

నిజాలేమిటో తేల్చాలని..

ఓ వైపు వైసిపి వారే పైపులు కోశారని చెబుతారని, మరోవైపు కాంట్రాక్టర్ సమస్య అంటారని, ఇంకోవైపు ఎలుకలు కొరికాయని చెబుతారని ఇందులో ఏది నిజమని అంటున్నారు. నిజనిర్ధారణ కమిటీ వేసి అసలు విషయం తేల్చాలని కొందరు అంటున్నారు.

ఇదిలా ఉండగా, సునీత కోటలో వైసిపి ప్లీనరీ

ఇదిలా ఉండగా, సునీత కోటలో వైసిపి ప్లీనరీ

మంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల క్రితం నిర్వహించిన ప్లీనరీకి మంచి స్పందన వచ్చింది. ఈ ప్లీనరీలో మంత్రి సునీతపై రాప్తాడు నియోజకవర్గ వైసిపి ఇంచార్జి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party leader and Minister Partiala Sunitha lashed out at YSR Congress Party chief YS Jaganmohan Reddy and his party leaders.
Please Wait while comments are loading...