పారిపోలేదు.. పరుగులు పెట్టిస్తున్నా..! జగన్ కు చంద్రబాబు పంచ్..!
ఏపీలో కూటమి సర్కార్ పనితీరు, హామీల అమలుపై తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన విమర్శలకు సీఎం చంద్రబాబు ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధిపై ఇవాళ ఆయన మరో ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇందులో రంగాల వారీగా అభివృద్ధి ఎలా ఉందో వివరించారు. దీంతో పాటు జగన్ చేసిన విమర్శలను తప్పుబడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా విధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని స్పష్టం చేశారు.
ప్రతీ త్రైమాసికం, ఆర్ధిక సంవత్సరంలో సాధిస్తున్న రాష్ట్రస్థూల ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఒక్కోక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. చేయలేమని మేం పారిపోవటం లేదని, రాష్ట్రాన్ని పరుగులు పెట్టించేలా చూస్తున్నామని తెలిపారు. ప్రజల కోసం ఎంత కష్టమైనా సరే బాధ్యత తీసుకుని అభివృద్ధి చేస్తామన్నారు. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రాజెక్టులపై మూల ధన వ్యయాన్ని గణనీయంగా పెంచి ప్రాజెక్టులు చేపట్టామన్నారు.

సుపరిపాలన ద్వారా ప్రజల వద్దకు వెళ్లి, వాట్సప్ గవర్నెన్సు ద్వారా ప్రజల చేతుల్లోకి పాలనను తీసుకొచ్చామన్నారు.
గాడితప్పిన 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించామన్నారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చి వెళ్లారు. చెత్తను తొలగించడానికే ఎక్కువ సమయం పడుతోందన్నారు. జనవరి 1 నాటికి ఎక్కడా చెత్త లేకుండా చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రజలకూ అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే 2025-26 ఆర్ధిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి సంబంధించి నమోదైన గణాంకాలను సీఎం విడుదల చేశారు.

రెండో త్రైమాసికం ప్రస్తుత ధరల్లో రాష్ట్ర జీఎస్డీపీ మొత్తంగా 11.28 శాతం వృద్ధి సాధించి రూ.4,00,377 కోట్లుగా నమోదైంది. ఇదే సమయానికి భారతదేశ జీడీపీ 8.7 శాతంగా ఉంది. గత ఏడాది 2వ త్రైమాసికంలో రాష్ట్ర జీఎస్డీపీ 10.17 శాతంగా ఉంది. దీని విలువ రూ.3,59,778గా ఉంది. అంటే ఈ త్రైమాసికంలో జీఎస్డీపీ గత ఏడాదితో పోల్చుకుంటే 1.11 శాతం పెరిగింది.
2వ క్వార్టర్‌కి రాష్ట్ర జీవీఏ 11.30 శాతం ఉండగా, జాతీయ జీవీఏ 8.7 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో వ్యవసాయ-అనుబంధ రంగాల జీవీఏ 10.70 శాతం , పరిశ్రమల రంగం 12.20 శాతం, సేవల రంగం 11.30 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ స్థాయిలో జీవీఏ వృద్ధి వ్యవసాయ రంగం 1.8 శాతం, పరిశ్రమల రంగం 8.5 శాతం, సేవల రంగం 10.6 శాతంగా ఉంది.
-
టీడీపీ ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్-తక్షణం..! -
అమరావతి బిల్లు పాస్ కాగానే లోకేష్ చేసిందిదే..! చంద్రబాబు రియాక్షన్..! -
పార్లమెంట్ లో అమరావతి బిల్లు వేళ చంద్రబాబు, జగన్ ఎత్తుకు పైఎత్తులు..! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications