స్కైబాబపై బెజవాడ దాడి: వారి వాదన ఇదీ, బూతు ఉందనే...

Posted By:
Subscribe to Oneindia Telugu
  స్కైబాబా పై బెజవాడ దాడి : నిరసన సెగ, విజయవాడలో ఉద్రిక్తత

  హైదరాబాద్: విజయవాడ పుస్తక మహోత్సవంలో తెలంగాణ రచయిత స్కైబాబపై జరిగిన దాడికి సంబంధించి సోషల్ మీడియాలో వాడిగా వేడిగా చర్చ సాగుతోంది. స్కైబాబ తెలంగాణ ఉద్యమ కాలంలో రాసిన ఓ కవితలో వాడిన పదాలను ఆంధ్ర రచయితలు కొంత మంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

  తెలంగాణ రచయిత స్కైబాబకు నిరసన సెగ: విజయవాడలో ఉద్రిక్తత

  అసలు స్కైబాబపై దాడి జరగలేదని, నిరసన వ్యక్తం చేశారని చెప్పేవారు కూడా ఉన్నారు. ఆయన ఎప్పుడో రాసిన ఓ కవితను వివాదంగా మార్చడాన్ని కూడా వ్యతిరేకించేవారున్నారు. కవితలో వాడిన భాషనే తీవ్రమైన వ్యతిరేకతకు కారణమైనట్లు కనిపిస్తోంది.

   ఆ కవితను ఉటంకిస్తూ ఇలా..

  ఆ కవితను ఉటంకిస్తూ ఇలా..

  వాసిరెడ్డి వేణుగోపాల్ అనే రచయిత, జర్నలిస్టు స్కైబాబ రాసిన ఆ కవితను ఉటంకిస్తూ రచయితలు, ఉచ్ఛనీచాలు తెలిసిన రచయితలు ఈ పదాలు తమ రచనల్లో వాడరని అన్నారు. "ఇది మా వాడుక భాష, ఇదే మా వాడుక భాష, ఇదే మా మాతృభాష, ఇదే అసలు సిసలు తెలుగు భాష అని మసిబూసి మారేడుకాయ చేయవద్దు. ఎవరు సహించినా సహించకపోయినా.. అల్లా సహించడు. అది గుర్తు పెట్టుకోండి" అని ఆయన వ్యాఖ్యానించారు.

   ఎప్పుడో రాశాడు కదా అని...

  ఎప్పుడో రాశాడు కదా అని...

  "ఎప్పుడో రాశాడు కదా.. వదిలేయండి అని మిత్రులు అన్నారు. ఎప్పుడో.. తెలంగాణ ఉద్యమ సమయంలో రాశాడు. వదిలేయండి అన్నారు. అప్పటి భావావేశంలో, భావోద్వేగంలో అనేకమంది ఇలాంటి మాటలే అని వుండవచ్చు. ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభజన తర్వాత మర్చేపోయారు. వాళ్ల తిప్పలేవో వాళ్లు పడుతున్నారు. వాళ్లు నిలదొక్కుకుంటారో, కుప్పకూలుతారో వాళ్లు చూసుకుంటారు.

  అంతేకానీ.. (పదం తొలగించాం) వేలుపెట్టి కెలికి వాసన చూడడం సమంజసం కాదు.
  అది కూడా బెజవాడ బుక్ ఫెస్టివల్ సందర్భంగా కెలికి వాసన చూడాలనుకోవడం అస్సలు సమంజసం కాదు" అని అన్నారు.

   కవితా శీర్షికను ఉటంకిస్తూ...

  కవితా శీర్షికను ఉటంకిస్తూ...

  "... పేరిట కవిత రాసిన స్కైబాబా కనీసం రెండేళ్లుగా పరిచయం. ఆయన పుస్తకాలు నా స్టాల్ లో కూడా డిస్ ప్లే వుండేవి. కానీ ఇంత ముతక రాతలు రాస్తున్నాడని తెలియదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠకులకు ఈ విషయంలో క్షమాపణ తెలియజేసుకుంటున్నాను. నా స్టాల్ లో డిస్ ప్లేలో వున్న కొన్ని పాత పుస్తకాలను షాజహాన్ గారివితో సహా విత్ డ్రా చేసుకుంటున్నాను" అని వాసిరెడ్డి వేణుగోపాల్ అన్నారు.

   అలా వాడుతున్నందుకే ఇలా..

  అలా వాడుతున్నందుకే ఇలా..

  "జనసాధారణంలో వుండే ‘తోపు' అనే పదాన్ని ప్రభుత్వ ప్రకటనల్లో వాడుతున్నందుకే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసించిన వాడిని నేను. జన్మతా ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేను ఆ పదప్రయోగం గురించి ప్రభుత్వాన్ని చాలా గట్టిగా నిలదీశాను.

  మరి బాధ్యతాయుత స్కైబాబా లాంటి రచయితలకు ఆ మాత్రం ఇంగితం వుండవద్దా? వీళ్లా ఈ సమాజాన్ని ఉద్ధరించే రచయితలు? ‘...' అనే పేరిట కవిత రాసిన వ్యక్తి గురించి.. ఆయన పుస్తక ఆవిష్కరణకు ఎగేసుకొచ్చిన వారికి, ముఖ్యంగా ఓల్గాలాంటి మహిళలకు ఏమీ పట్టదా? ఇక ఓల్గాలాంటి మహిళలు రాసిన పుస్తకాలనుంచి మేము చదువుకుని చట్టుబండలు కట్టుకున్నదేమిటి? ఇలాంటి పుస్తకాల ఆవిష్కరణలకు పిలిచినప్పుడే ‘‘.....'' అని ఈసడించవద్దా? కాస్త గడ్డి పెట్టవద్దా?" అని వాసిరెడ్డి వేణుగోపాల్ అన్నారు.

   కాదనరు, తిట్లు భావస్వేచ్ఛనా

  కాదనరు, తిట్లు భావస్వేచ్ఛనా

  "భావస్వేఛ్ఛ ను ఎవ్వరూ కాదనరు, కానీ తిట్లు కూడా భావస్వేఛ్ఛ అంటే ఎలా !! "..." అనే పదాన్ని ప్రగతిశీల మహిళా శక్తులు కూడా సమర్థించటం వింతగా ఉంది. ఇంత పెద్ద బూతులో వీళ్ళెవరికీ అది కరుడుగట్టిన పురషాహంకార సూచన అని కానీ , ఆది స్త్రీలను సెక్స్ బానిసలు గా చూసే పదం అనికానీ అనిపించకపోవటం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఆరోవేలు ( పురుషాంగం) ని ధవళేశ్వరంలో కడుగుతా అనే వాక్యంలో కవిత్వం ఎక్కడుంది !! "..... " అనే పదాన్ని కవిత్వం లో సమర్థిద్దామా !! మరొకరి అమ్మను సెక్స్ దృష్టితో మాట్లాడే ఈ పదాన్ని కవిత్వం అందామా !! భావస్వేఛ్ఛ పేరుతో ఏంచేసినా సరే అనేద్దామా !! అయినా విజయవాడలో ఆ బూతుకవిత్వాన్ని నిరసించిన వారిది కూడా భావస్వేఛ్ఛే !! వారు పుస్తకావిష్కరణ కూడా చేసుకోండి, అభ్యంతరం లేదు అనే అన్నారు కదా !! కాకపోతే వారడిగింది ఒక్కటే, అలాంటి పదాలతో ఆంధ్రప్రజలను అవమానించినందుకు విచారం వ్యక్తం చేయమన్నారు" అని రావిపాటి మోహన్ అన్నారు.

  అలా అంటే సరిపోయేది...

  అలా అంటే సరిపోయేది...

  "ఒకవేళ చాలామంది సమర్థిస్తున్నట్లు ఉద్యమ వేడిలో రాసినా, అది ఉద్యమసమయంలో రాశాను, ఇప్పుడు నాకు అలాంటి ఉద్దేశ్యాలు లేవు అని చెప్తే సరిపోయేదిగా !! నిజంగా కేవలం ఉద్యమసమయంలో వచ్చిన తాత్కాలిక కోపమే అయితే ఖచ్చితంగా ఇప్పుడు విచారం వ్యక్తం చేసుండేవాడు !! కానీ చేయలేదు అంటే దానర్థం ఇప్పటికి కూడా మిమ్మల్ని "..." అనే అంటాను. మీరందరూ "*....." అని చెప్పటం కాదా !! ఒకరి బావస్వేఛ్ఛను గౌరవించటం కోసం కోట్ల మంది అమ్మల్ని "*ంజలు" అని నిర్ణయించేద్దామా !! ఆలోచించండి, భావస్వేచ్ఛ ఉండాల్సిందే, కానీ ఎదుటివాడిని బానిసగా నిర్ణయించేంత కాదు. ఎదుటివాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేంతగా కాదు.భావస్వేఛ్ఛ పేరుతో ప్రతిదీ సమర్థించటం శోచనీయం. ప్రగతిశీల శక్తులు అని చెప్పుకొనేవారు, ఒకరి ఆత్మగౌరవాన్ని కించపరిచే రాతలను నిస్సిగ్గుగా వెనకేసుకోని రావటం భాధాకరం" అని మోహన్ రావిపాటి అన్నారు.

   జరిగింది దాడి కాదని...

  జరిగింది దాడి కాదని...

  "స్కైబాబా మీద జరిగింది దాడి కాదు, ఆయన రాసిన అసభ్య రాతలకు ముఖ్యంగా "....." అన్న పదాన్ని నిరసిస్తూ "మా తెలుగు తల్లికి మల్లెపూదండ" గేయాన్ని ఆలపించటం మాత్రమే జరిగింది. అసభ్య రాతలు కూడా భావస్వేఛ్ఛ అని సమర్థించటం పొరపాటు. ఎదటివారి ఆత్మగౌరవాన్ని బూతులు తిట్టి, వారు నిరసిస్తే అది దాడి అనటం సరైనది కాదు. నిరసన తెలపటం కూడా భావస్వేఛ్ఛే !! అందరికీ భావస్వేచ్ఛ ఉంది. అది స్కైబాబా కే పరిమితం అయ్యింది కాదు. నిజానిజాలు నిర్థారించుకోకుండా, ఏమైందో తెలుసుకోకుండా స్పందించటం తొందరపాటు అవుతుంది" అని కూడా మోహన్ రావిపాటి అన్నారు.

   దాడిని ఖండిస్తూనే ఇలా.

  దాడిని ఖండిస్తూనే ఇలా.

  "స్కైబాబా మీద ' జరగబోయిన ' దాడిని నిర్ధ్వంద్వంగా ఖండిస్తున్నా. ఆంధ్రావాళ్లకు వ్యతిరేకంగా ఆయన రాసిన రాతల్నీ ఇంకా తీవ్రంగా ఖండిస్తున్నా" అని ప్రముఖ కవి విల్సన్ సుధాకర్ తుల్లిమిల్లి అన్నారు.

   వీడియోను జాగ్రత్తగా చూశా...

  వీడియోను జాగ్రత్తగా చూశా...

  "స్కై బాబాకు వ్యతిరేకంగా ఆందోళన జరిగిన వీడియోలు జాగ్రత్తగా చూశాను. దాడి జరిగినట్లు గానీ, దాడికి ప్రయత్నించినట్లు గానీ ఎక్కడా కనబడలేదు. ఎవరి భావ ప్రకటన వారిది. నిజంగా దాడి జరిగినా దాడికి ప్రయత్నిoచినా ఆ చర్యను ఖండించాల్సిందే. తీవ్ర నిరసనలా కనబడుతున్నది" సాయి కుమార్ అనిశెట్టి అనే ఆయన అన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The protest against Telangana writer Skybaba became hot topic in social media, Netizens are saying attack was not took place.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి