కాపు సీఎం-దళిత డీసీఎం కలకలం..! పీవీ సునీల్ పై కేంద్రానికి రఘురామ ఫిర్యాదు..!
ఏపీలో మరోసారి కులాల కుంపటి తెరపైకి వచ్చింది. కాపులకు సీఎం పదవి ఇచ్చేసి, దళితులు డిప్యూటీ సీఎం పదవి తీసుకుందామంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన ప్రతిపాదన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉండగా.. ఈ కొత్త ప్రతిపాదనతో పీవీ సునీల్ వీరిద్దరి మధ్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. దీనిపై డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు వెంటనే రంగంలోకి దిగారు.
వైసీపీ హయాంలో సీఐడీ ఛీఫ్ గా పనిచేసి పలు వివాదాల్లో చిక్కుకున్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ను తాజాగా కూటమి సర్కార్ సస్పెండ్ చేసింది. అనుమతి లేకుండా పదే పదే విదేశీ పర్యటనలకు వెళ్లారన్న ఆరోపణలతో ఆయన్ను సస్పెండ్ చేశారు. అయితే ఆయన గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజును సీఐడీ కస్టడీలో హింసించారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పీవీ సునీల్ కాపుల్ని సీఎం చేసి, దళితులు డిప్యూటీ సీఎం చేసుకొందామంటూ చేసిన ప్రతిపాదన వీడియో బయటికి వచ్చింది. ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఓవైపు పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి రొటేషన్ లో అయినా ఇవ్వాలంటూ ఆయన అభిమానులు డిమాండ్లు చేస్తున్నారు. మరోవైపు పీవీ సునీల్ చేసిన ప్రతిపాదన కాపుల్ని ఆలోచనలో పడేసింది. అలాగే దళిత నేతలైన హర్షకుమార్, విజయ్ కుమార్, జడ శ్రావణ్ లో ఒకరిని డిప్యూటీ సీఎం చేద్దామంటూ చేసిన ప్రతిపాదనతో పీవీ సునీల్ ఆ వర్గంలోనూ ఆలోచన రేపారు. దళితవాడల్ని పంచాయతీలు చేయాలన్న ప్రతిపాదనకు మద్దతిస్తే ఈ ప్లాన్ అమలు చేద్దామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఇరుకునపడినట్లయింది.

ఈ నేపథ్యంలో పీవీ సునీల్ కుమార్ అంటేనే మండిపడే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వెంటనే రంగంలోకి దిగారు. అఖిల భారత సర్వీసు నిబంధనలకు విరుద్దంగా పీవీ సునీల్ చేసిన వ్యాఖ్యలపై వెంటనే స్పందించి ఆయన్ను పదవి నుంచి తప్పించాలంటూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖకు లేఖ రాశారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా పీవీ సునీల్ చేసిన వ్యాఖ్యలు అఖిల భారత సర్వీసు నిబంధనల ఉల్లంఘనే అంటూ డీవోపీటీకి రాసిన లేఖలో రఘురామ పేర్కొన్నారు. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications