వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామ భారీ ట్విస్ట్- జగన్, సాయిరెడ్డి బెయిల్ రద్దు తీర్పులు ఆపండి- హైకోర్టులో పిటిషన్

|
Google Oneindia TeluguNews

సీబీఐ దాఖలు చేసిన అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ తో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిళ్ల రద్దు కోరుతూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లపై రేపు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించబోతోంది. ఇందులో వీరిద్దరి బెయిళ్లు రద్దవుతాయా లేదా అనే దానిపై ఉత్కంఠ పెరుగుతోంది. అదే సమయంలో రఘురామరాజు మరో భారీ ట్విస్ట్ ఇచ్చారు ఏకంగా ఈ తీర్పులపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు లాస్ట్ మినిట్ ట్విస్ట్ గా మారింది.

రఘురామ పిటిషన్లు

రఘురామ పిటిషన్లు

సీబీఐ అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కొన్ని నెలల క్రితం సీబీఐ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సీబీఐ కోర్టు సీబీఐ, వైఎస్ జగన్, సాయిరెడ్డి, రఘురామ సహా పలువురి వాదనలు విన్నది. ఆ తర్వాత తీర్పు వెలువరించేందుకు గత నెల 23న సిద్దమైన తరుణంలో సుప్రీంకోర్టు ఈ తరహా కేసులపై ఇచ్చే ఆదేశాల కోసం ఎదురుచూసే క్రమంలో తీర్పుల్ని ఈ నెల 15కు అంటే రేపటికి వాయిదా వేసింది. దీంతో రేపు వెలువడే తీర్పులు వీరిద్దరికీ కీలకంగా మారాయి.

రేపే జగన్, సాయిరెడ్డి బెయిల్స్ పై సీబీఐ కోర్టు తీర్పు

రేపే జగన్, సాయిరెడ్డి బెయిల్స్ పై సీబీఐ కోర్టు తీర్పు

అక్రమాస్తుల కేసులో గతంలో జగన్, సాయిరెడ్డికి మంజూరు చేసిన బెయిల్స్ ను వారిద్దరూ దుర్వినియోగం చేశారంటూ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు రేపు కీలక తీర్పులు వెలువరించేందుకు సిద్ధమైంది. ఈ రెండు తీర్పులు జగన్, సాయిరెడ్డి భవితవ్యాన్ని తేల్చనున్న నేపథ్యంలో వీటిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంటోంది. వీరి బెయిల్స్ రద్దయితే చోటు చేసుకునే పరిణామాలపై ఇప్పటికే ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. బెయిల్స్ రద్దు కాకపోతే మాత్రం అంతా ఊపిరి పీల్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

 చివరి నిమిషంలో రఘురామ భారీ ట్విస్ట్

చివరి నిమిషంలో రఘురామ భారీ ట్విస్ట్

జగన్, సాయిరెడ్డి బెయిల్స్ పై రేపు సీబీఐ కోర్టు తీర్పు వెలువడుతున్న వేళ వైసీపీ రెబెల్ ఎంపీ, పిటిషనర్ కూడా అయిన రఘురామకృష్ణంరాజు భారీ ట్విస్ట్ ఇచ్చారు. సీబీఐ కోర్టు తీర్పు వెలువరించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ వ్యవహారం సర్వత్రా కలకలం రేపుతోంది. అసలు రఘురామ ఈ తీర్పులు వెలువడకముందే తీర్పు ఆపాలంటూ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారనే దానిపై ఇఫ్పుడు భారీ చర్చే జరుగుతోంది. దీంతో రేపు సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పులు ఆపే విషయంలో తెలంగాణ హైకోర్టు రఘురామ పిటిషన్ పై అత్యవసర విచారణకు సిద్ధమైంది.

బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీ కోరిన రఘురామ

బెయిల్ రద్దు పిటిషన్ల బదిలీ కోరిన రఘురామ

వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లపై సీబీఐ కోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వబోతున్న నేపథ్యంలో రఘురామ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో రేపు వెలువరించే ఈ తీర్పులు ఆపాలంటూ కోరడంతో పాటు మరో విజ్ఞప్తి కూడా చేశారు. వీరిద్దరి బెయిల్ పిటిషన్లపై సీబీఐ కోర్టులో కాకుండా మరో కోర్టులో విచారణ జరపాలని హైకోర్టును కోరారు. దీంతో అసలు తీర్పు రాకుండానే దానిపై భయాలతో రఘురామ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారనే దానిపై చర్చ మొదలైంది. సీబీఐ కోర్టులో తీర్పు తనకు ప్రతికూలంగా వస్తుందని రఘురామ ముందే ఊహించారా అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

 రఘురామ పిటిషన్ పై హైకోర్టు అత్యవసర విచారణ

రఘురామ పిటిషన్ పై హైకోర్టు అత్యవసర విచారణ

జగన్, సాయిరెడ్డి బెయిల్ పిటిషన్లపై సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వకుండా ఆపడంతో పాటు ఈ పిటిషన్లను మరో కోర్టుకు బదిలీ చేయాలని రఘురామ వేసిన పిటిషన్ పై అత్యవసర విచారణ కోరారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఆయన విజ్ఞప్తికి అంగీకరించింది. ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టు ఈ పిటిషన్ పై అత్యవసర విచారణ చేపట్టబోతోంది. ఇందులో రఘురామ పిటిషన్ కు దారి తీసిన కారణాలు, ఎందుకు సీబీఐ కోర్టు తీర్పు ఇవ్వకుండా ఆపాలని కోరుతున్నారనే దానిపై హైకోర్టు విచారణ జరపబోతోంది.

Recommended Video

Vijayawada లో Sonu Sood కి ఊహించని క్రేజ్.. Amaravati రైతులకి మాటిచ్చిన సోనూ || Oneindia Telugu
రఘురామకు సిగ్నల్స్ అందాయా ?

రఘురామకు సిగ్నల్స్ అందాయా ?


జగన్, విజయసాయిరెడ్డి బెయిళ్ల రద్దు కోరుతూ తాను దాఖలు చేసిన పిటిషన్లపై ఇప్పటికే విచారణ పూర్తి చేసిన హైదరాబాద్ సీబీఐ కోర్టు రేపు తీర్పు ఇవ్వబోతోంది. అయితే ఈ తీర్పులో ఏముందనే దానిపై ఇఫ్పటివరకూ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. వాస్తవానికి గత నెల 23న ఇవ్వాల్సిన ఈ తీర్పుల్ని సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది. అయితే ఈ తీర్పుల్లో ఏముందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుండగా.. పిటిషనర్ అయిన రఘురామకు మాత్రం దీనిపై ఎలా సిగ్నల్స్ అందాయన్న దానిపై చర్చ జరుగుతోంది. ఎలాంటి సిగ్నల్స్ లేకుండా ఆయన హైకోర్టును ఎందుకు ఆశ్రయించారన్న దానిపైనా విస్తృత చర్చ జరుగుతోంది. ఏదేమైనా హైకోర్టు ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుంటుందో లేదో అన్నది ఇవాళ సాయంత్రానికి తేలిపోనుంది.

English summary
ysrcp rebel mp raghurama raju ask telangana high court to stop deliver cbi court verdict on ap cm ys jagan and vijaya sai reddy bail cancel petitions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X