విజయవాడ,సికింద్రాబాద్ లతో సహా ఆ రైల్వేస్టేషన్లలో..
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో అప్రమత్తమైన భద్రతా సంస్థలు విస్తృత తనిఖీలు చేపట్టాయి ఈ ఘటన తర్వాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీస్ శాఖలకు హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా జన సమర్థం ఎక్కువగా ఉండే రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్లలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.
ఏపీ, తెలంగాణాలలో భారీ సెర్చ్ ఆపరేషన్
అనుమానాస్పద వస్తువులు లేదా వాహనాలు లేదా వ్యక్తుల పైన ప్రత్యేక దృష్టి సారించాలని అలర్ట్ చేయడంతో పోలీసులు ప్రతిచోట పటిష్టంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలలో భారీగా సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలను చేపడుతున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ డాగ్ స్క్వాడ్ బృందాలు విస్తృతంగా తనిఖీలను చేపట్టాయి.

సికింద్రాబాద్, వరంగల్ రైల్వే స్టేషన్ లలో తనిఖీలు
అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇక బస్టాండ్లు, మెట్రో స్టేషన్ల వద్ద కూడా అదనపు సిబ్బందిని నియమించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనల నేపథ్యంలో వరంగల్ రైల్వేస్టేషన్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా వరంగల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు.
అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ
వరంగల్ జీఅర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలను చేపట్టారు. సీఐ సురేందర్ నేతృత్వంలో స్టేషన్లో ప్రతి మూలనూ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయాణికుల లగేజీ బ్యాగులను తనిఖీ చేసి అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు కాజీపేట రైల్వే స్టేషన్ లోనూ జిఆర్పి, ఆర్పిఎఫ్ సిబ్బంది తనిఖీలు చేశారు.ప్రయాణికుల వెంట ఉన్న లగేజీ బ్యాగులు, పార్సిళ్లను మెటల్ డిటెక్టర్ల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
విజయవాడ, విశాఖ, తిరుపతి స్టేషన్ల లోనూ విస్తృత తనిఖీలు
ముఖ్యంగా రైళ్లు రాకపోకలు సాగించే సమయాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి రైల్వే స్టేషన్లలో విస్తృత తనిఖీలు చేపట్టారు. బాగా రద్దీగా ఉండే ప్రాంతాలు, హోటళ్లు, లాడ్జీలలో కూడా పోలీసులు సోదాలను నిర్వహిస్తున్నారు. బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ బృందాలు, డాగ్ స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ప్రజల భద్రతకు మరింత ప్రాధాన్యతనిస్తూ క్షుణ్ణంగా తనిఖీలను చేపట్టారు.
-
అక్కడ వారం రోజులు చికెన్, మటన్, ఫిష్ షాపులు బంద్.. విక్రయిస్తే చర్యలే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications