విశాఖలో దారుణం: ప్రియురాలిని హతమార్చి, ముక్కలుగా కోసి ఫ్రిజ్లో పెట్టిన నేవీ ఉద్యోగి
విశాఖపట్నంలో దారుణ హత్య జరిగింది. ఓ నేవీ ఉద్యోగి ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆమె శరీర భాగాలను కట్ చేసి, ఫ్రిజ్లో పెట్టాడు. సినిమాలు, వెబ్ సీరీస్ ల ప్రభావంతో ఇలాంటి దారుణాలు చాలా ఎక్కువయ్యాయి. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ప్రియురాలిని హతమార్చిన నేవీ ఉద్యోగి
విజయనగరం జిల్లా రాజాంకు చెందిన నేవీ టెక్నీషియన్ చింతాడ రవీంద్ర విశాఖపట్నంలోని ఎల్బీనగర్ లో నివసిస్తున్నాడు. రవీంద్ర భార్య నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్ళింది. గతంలో రవీంద్రకు విశాఖకు చెందిన మౌనికతో పరిచయం ఉంది. ఈ క్రమంలో అతను ఆమెను తను ఉండే ఫ్లాట్ కి రమ్మని పిలిచి దారుణంగా హత్య చేశాడు. ఆమె శరీర భాగాలను ఫ్రిజ్లో భద్రపరిచాడు. ఇక ఈ హత్య ఆదివారం మధ్యాహ్నం జరిగినట్టు సమాచారం.

ఫ్రిజ్లో రెండు మూటలలో కట్టి పెట్టిన మౌనిక శరీర భాగాలు
హత్య చేసిన అనంతరం రవీంద్రకు ఏం చేయాలో పాలుపోక శ్రీకాకుళంలో ఉన్న స్నేహితుడికి తెలియజేశాడు. దీంతో ఆ స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఆపై పోలీసులు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు రవీంద్ర ఇంట్లో ఉన్న ఫ్రిజ్లో రెండు మూటలలో కట్టి పెట్టిన మౌనిక శరీర భాగాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న శరీర భాగాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.
ప్రియురాలి వేధింపులతో ఘాతుకం
అయితే తల, కాళ్ళు, చెప్పులు, సిమ్ కార్డులు సూట్ కేసులో పెట్టి తీసుకెళ్ళి దారపాలెంలో తగలబెట్టాడు. మూడు సంవత్సరాల క్రితం రవీంద్ర, మౌనిక మద్య పరిచయం ఏర్పడి వీరిద్దరి పరిచయం తర్వాతే అతను వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. దీంతో మౌనిక అతడిని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం, ఆర్థికంగా ఆదుకోవాలని పదేపదే ఒత్తిడి పెట్టటం మొదలెట్టింది. వేధింపుల నుంచి తప్పించుకోవడానికి రవీంద్ర కావాలనే భార్యను పుట్టింటికి పంపాడు.
ప్లాన్ ప్రకారమే ప్రియురాలి హత్య
పథకం ప్రకారం మౌనికను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. అత్యంత దారుణంగా విశాఖపట్నంలో నేవీ ఉద్యోగి చేసిన ఈ హత్య ప్రస్తుతం కలకలంగా మారింది. మనుషులను అత్యంత దారుణంగా హత్య మారుస్తున్న హింసా సంస్కృతి, ముక్కలుగా కట్ చేసి ఫ్రిజ్లో పెట్టిన క్రిమినల్ స్వభావం ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేస్తుంది.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!













Click it and Unblock the Notifications