వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హడావుడిగా విభజన: తెలంగాణపై కాదని సుజన, రాజ్‌నాథ్‌తో డిజిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టాన్ని హడావుడిగా రూపొందించారని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి శుక్రవారం అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేయాలని తాము చెప్పడం లేదన్నారు.

Sujana Choudhary comments on AP division

రాజ్‌నాథ్‌ను కలిసిన డిజిపి

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ఏపీ డిజిపి జేవి రాముడు శుక్రవారం నాడు కలిశారు. విభజన సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు. అప్పా, గ్రేహౌండ్స్, ఆక్టోబస్ సంస్థల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని కోరారు. హోంమంత్రి అందుకు సానుకూలంగా స్పందించారు.

కాగా, అంతకుముందు వెంకయ్య మాట్లాడుతూ... దేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాలు కూడా బాధ్యతా యుతంగా వ్యవహరించాలని వెంకయ్య లోకసభలో అన్నారు. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నాయని, అభివృద్ధి చెందిన పంజాబ్‌ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక అడుగుతున్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు ఉన్నందునే ప్రత్యేక హోదా అడిగామని స్పష్టం చేశారు.

వైసిపిపై మండిపడ్డ టిడిపి రేణుక

కాంగ్రెస్ పాలనలో ఇసుక రీచ్‌లను అనుచరులకు దోచి పెట్టారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేణుక ఆరోపించారు. ఉమ్మడి ఏపీలో ఏడాదికి రూ.80 కోట్ల ఆదాయం వస్తే, ఇప్పుడు నవ్యాంధ్ర ప్రదేశ్‌లోనే రూ.800 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు.

ఇసుక మైనింగ్‌లో మహిళా గ్రూపుల భాగస్వామ్యం దేశంలో ఏ రాష్ట్రంలోను జరగలేదన్నారు. అవినీతి పార్టీలు తమ పైన ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. ప్రస్తుతం ఇసుక పాలసీలో లోటుపాట్లను సవరించి జనవరి 1 నుంచి మరింత పటిష్టమైన విధానం అమలు చేస్తామన్నారు.

English summary
Union Minister Sujana Choudhary comments on AP division.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X