వీడియో తీసి బెదిరింపులు.. భయంతో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యాయత్నం!
విజయవాడ జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి వారిని కొంతమంది యువకులు బెదిరించడమే కారణమని తెలుస్తోంది.
విజయవాడ: నగరంలోని జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ అఘాయిత్యానికి వారిని కొంతమంది యువకులు బెదిరించడమే కారణమని తెలుస్తోంది.
పాఠశాల ఆవరణలో ఆ విద్యార్థినులు ఆడుకుంటుండగా కొంతమంది యువకులు వారి వీడియోలు తీశారు. ఆ తరువాత వాటిని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు.

దీంతో భయపడిన ఆ ముగ్గురు బాలికలు కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే పాఠశాల ఉపాధ్యాయులు వారిని చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో వారికి ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆ విద్యార్థినులను బెదిరించిన యువకుల గురించి ఆరా తీస్తున్నారు.
More From
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications