పవన్ అభ్యర్ధనను తిరస్కరించిన TTD, అసలు ఏం జరిగింది..!!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందడి మొదలైంది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ అర్ద్రరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు తెరుచుకో నున్నాయి. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సారి సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ వెల్లడించింది. కాగా, డిప్యూటీ సీఎం పవన్ తో పాటుగా మరో మంత్రి చేసిన అభ్యర్ధనను టీటీడీ తిరస్కరించింది.
ప్రభుత్వంలోని ఇద్దరు ప్రముఖుల ప్రతిపాదనలను టీటీడీ తిరస్కరించింది. ఉపముఖ్యమంత్రి పవన్ తో సహా రెవిన్యూ మంత్రి అనగాని తాజాగా టీటీడీకీ ప్రత్యేకంగా వినతులు చేసారు. తిరుమల లో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలకు అతిథిగృహాల నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి అనగాని సత్యప్రసాద్ అభ్యర్ధించారు. కాగా, వీరిద్దరి
అభ్యర్థనలను టీటీడీ తిరస్కరించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

వీఐపీల ప్రొటోకాల్, తిరుమలలో ఉత్సవాల ఏర్పాట్లలో రెవెన్యూ శాఖది కీలక పాత్ర. ఈ అవసరాల దృష్ట్యా తిరుమల లో తమకు ప్రత్యేకంగా అతిథిగృహం అవసరమని ఆ శాఖ భావించింది. విషయాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్లడంతో తిరుమల కొండపైన 2ఎకరాల భూమి కేటాయించాల ని కోరుతూ ఆయన టీటీడీకి లేఖ రాశారు.
అయితే, దీని కంటే ముందు పంచాయతీరాజ్ భవన్ పేరుతో అతిథిగృహం నిర్మించుకోవడానికి తిరుమలలో స్థలం కేటాయించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి కూడా లేఖ అందింది. ఈ రెండింటిపై 16న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించారు. కొండపైన భూమి లభ్యత పరిమితంగా ఉన్నందున కొన్నేళ్లుగా కొత్త నిర్మాణాలపై నిషేధం ఉంది. ఈ విషయంలో హైకోర్టు పలు పరిమితులు విధించడంతో శిథిలావస్థకు చేరిన గెస్ట్‌హౌస్‌లు, కాటేజీ లను పునర్నిర్మించడానికే టీటీడీ పరిమితం అవ్వాలని డిసైడ్ అయింది.
ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం, మంత్రుల అభ్యర్థనలను టీటీడీ పాలకమండలి తిరస్కరించింది. అయితే ప్రత్యామ్నాయంగా తిరుమలలో ఇప్పటికే వున్న అతిథిగృహాల్లో అనువైన భవనాన్ని కేటాయించా లని నిర్ణయించింది. అయితే.. టీటీడీ ఇప్పటికే ఉన్న అతిథిగృహాల పేర్ల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. దేవుడి పేర్లతోనే వీటిని నిర్వహించాలని దాతలకు స్పష్టం చేస్తూ కొత్త పేర్లను ఖరారు చేసింది.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications