తిరుమల లడ్డూ కౌంటర్లు, కల్యాణకట్ట వద్ద ఇకపై..
Tirumala: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 68,075 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 26,535 మంది తలనీలాలను సమర్పించారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.80 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 30 కంపార్ట్ మెంట్టు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనానికి 18 నుండి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లల్లో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు.

తిరుమలలో భక్తులకు కల్పించే సౌకర్యాలను మరింత బలోపేతం చేయడానికి టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ దిశగా అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. టీటీడీ అందిస్తోన్న సేవలు, కల్పిస్తోన్న సౌకర్యాలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు జారీ చేశారు.
కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని వెంకయ్య చౌదరి ఆదేశించారు. అక్కడ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ పలువురు భక్తులు సూచించినట్లు తెలిపారు. ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల నుండి క్రమంగా అభిప్రాయాలను సేకరించడం జరుగుతోందని, దీన్ని మరింత విస్తృతం చేయాలని అన్నారు. కల్యాణకట్ట, లడ్డూ కౌంటర్, క్యూ లైన్లు, వసతి గదులు వంటి ప్రాంతాల్లో భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సూచించారు.
కాలిబాట మార్గాల్లో పంచాయతీ, ఆరోగ్య విభాగాలు కలసి తరచూ తనిఖీలు నిర్వహించాలని, ఆ మార్గాల్లోని దుకాణాల్లో వస్తువుల ధరలను పర్యవేక్షించాలని అన్నారు. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో సిబ్బంది చేతులకు కవర్లు ధరించి భక్తులకు ప్రసాదాలు వడ్డించాలని సూచించారు. భక్తులు చేతులు కడుగు ప్రదేశం, హాళ్లలో తడి లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. లగేజీ కౌంటర్ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు సకాలంలో లగేజీ అందేలా సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని చెప్పారు.
భక్తులు గదుల కాషన్ డిపాజిట్ తిరిగిపొందడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు తీసుకోవాలని అదనపు ఈఓ చెప్పారు. ఏటీసీ నుండి ఆక్టోపస్ సర్కిల్ వరకు ఉండే క్యూలైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు అందేలా అధికారులు నిత్యం క్యూలైన్లను పర్యవేక్షించాలని అన్నారు. అదేవిధంగా క్యూలైన్లు, కంపార్ట్ మెంట్లలో పరిశుభ్రత విషయంలో రాజీ పడకూడదని ఆదేశించారు. అన్న ప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్, క్యూలైన్ల నిర్వహణ, లడ్డూ కౌంటర్ విభాగాలపై వచ్చిన భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పారు. తదుపరి సమావేశంలో వాటి పురోగతిపై రిపోర్టు అందజేయాలని అన్నారు.
-
మోహన్ బాబు 'పద్మశ్రీ' వెనక్కు..తెర వెనుక, అనూహ్య పరిణామాలు..!! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్..












Click it and Unblock the Notifications