వైసీపీ నాయకులు ఫుడ్ కోసం కొట్టుకున్నారు.. వాళ్లకు హోం మంత్రి హితోపదేశం!
తెలుగుదేశం పార్టీ ఉంటేనే నాయకులుగా మనలాంటి వారికి గుర్తింపు ఉంటుందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నామని ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ఆమె టిడిపి శ్రేణులకు కీలక సూచన చేశారు. ఇక వైసీపీపైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని నక్కపల్లి హోం మంత్రి క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి వంగలపూడి అనిత ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.
టిడిపిలో పదవి అలంకారం కాదన్న హోం మంత్రి అనిత
బూత్, గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో వివిధ బాధ్యతలు పొందిన నాయకులతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం కేక్ కట్ చేసి, పదవులు స్వీకరించిన నేతలకు మంత్రి అనిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ టిడిపిలో పదవి అలంకారం కాదని, అది బాధ్యత అని స్పష్టం చేశారు. కార్యకర్తల సంక్షేమమే టిడిపి లక్ష్యమని అనిత పేర్కొన్నారు.

గత పెట్టుబడిదారుల సమ్మిట్ లో జరిగిందిదే : అనిత
గత ప్రభుత్వ హయాంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని హోం మంత్రి వంగలపూడి అనిత గుర్తు చేశారు. ఎన్నో అవమానాలను తట్టుకొని గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ అరాచక పాలన నుంచి ప్రజలకు స్వాతంత్రం లభించిందని చెప్పారు. వైసిపి హయాంలో పెట్టుబడిదారుల సమ్మిట్‌లో వైసిపి శ్రేణులు హడావిడి చేశారని, భోజనాల కోసం కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం 13 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చింది
విశాఖపట్నంలో జరిగిన పెట్టుబడిదారుల సమ్మిట్‌లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని అనిత పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లాకు అత్యధిక పెట్టుబడులు వచ్చాయన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం వలన జిల్లా తలసరి ఆదాయం పెరుగుతుందని, పాయకరావుపేట అభివృద్ధిని తను లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. ఇంటికి ఒక ఉద్యోగం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
మహిళల ఉపాదికి బొమ్మల పరిశ్రమ
ఇప్పటికే బొమ్మల పరిశ్రమ ఏర్పాటుకు జీవో జారీ అయింది అని తెలిపిన అనిత, దీనివల్ల మహిళలకు భారీగా ఉపాధి కలుగుతుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. టిడిపి శ్రేణుల ఐక్యతే పార్టీకి బలమని అనిత పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రణాళికా బద్ధంగా పని చెయ్యండి
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత టిడిపి కార్యకర్తల పైన ఉందన్నారు. తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నామని అనిత చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని హోం మంత్రి అనిత సూచించారు.
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications