విశాఖ-సికింద్రాబాద్ దురంతో ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు గుడ్ న్యూస్..!
తెలుగు రాష్ట్రాల్లోని రెండు కీలక నగరాలు సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగిస్తున్న దురంతో ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ఓ శుభవార్త చెప్పింది. దురంతో ఎక్స్ ప్రెస్ లో ప్రయాణికుల రద్దీ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. దురంతో ఎక్స్ ప్రెస్ కు అదనపు బోగీల్ని అమర్చాలని నిర్ణయించారు. దీంతో రద్దీ సమయాల్లో ప్రయాణికులకు అదనపు సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయి.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే దురంతో ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 22204, అలాగే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ కు ప్రయాణించే దురంతో రైలు నంబర్ 22203 కూ ఏసీ థర్డ్ క్లాస్ లో మరో మూడు అదనపు బోగీలు అమర్చాలని రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్-విశాఖ దురంతోకు ఈ నెల 24 నుంచి, విశాఖ-సికింద్రాబాద్ దురంతో రైలుకు ఈ నెల 25 నుంచి ఈ ధర్డ్ ఏసీ క్లాస్ అదనపు బోగీలు అందుబాటులోకి రాబోతున్నాయి.

మరోవైపు అనకాపల్లి-సికింద్రాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్న ప్రత్యేక రైళ్లకు సైతం ఇలా ధర్డ్ ఏసీ అదనపు బోగీలు అమర్చాలని నిర్ణయించారు. దీని ప్రకారం సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య నడుపుతున్న రెండు ప్రత్యేక రైళ్లు నంబర్లు 07055, 07056కు మూడేసి ధర్డ్ ఏసీ కోచ్ లు అమర్చబోతున్నారు. సికింద్రాబాద్-అనకాపల్లి రైలుకు ఈ నెల 22 నుంచి, అనకాపల్లి-సికింద్రాబాద్ రైలుకు ఈ నెల 23 నుంచి ఇలా మూడేసి ధర్డ్ ఏసీ అదనపు కోచ్ లు అందుబాటులోకి తెస్తున్నారు. కాబట్టి ప్రయాణికులు ఈ మార్పులు గమనించి టికెట్లు బుక్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications