''శిల్పాపైనే పోరాటం, జగన్ అంటే గౌరవం'', ''బాలకృష్ణ అలా మాట్లాడితే తప్పుకాదా''?

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నా తల్లిపై గౌరవం ఉంటే మా తండ్రి మరణించినప్పుడు చివరి చూపు కోసం కూడ ఎందుకు రాలేదని వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ప్రశ్నించారు. భూమా నాగిరెడ్డిని విమర్శించేందుకు వైసీపీ నేతలు ఎందుకు ఉత్సాహన్ని చూపుతున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

చదవండి: కుట్రలు, కుతంత్రాలు చేసినా న్యాయమే గెలిచింది: శిల్పా మోహన్‌రెడ్డి

సోమవారంనాడు ఓ తెలుగుఛానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆమె రోజాను ప్రశ్నించారు. నంద్యాల ఉప ఎన్నికను పురస్కరించుకొని వైసీపీ, టిడిపి నేతలు ఎన్నికల్లో విజయం కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

దీంతో నంద్యాలలో పొలిటికల్ హీట్ పెరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలతో రెండు పార్టీల నేతలు మీడియాలో పతాకశీర్షికల్లో నిలుస్తున్నారు. రాజకీయ అంశాలను పక్కన పెట్టి వ్యక్తిగత విషయాలపైకి కూడ నేతలు విమర్శలకు దిగుతున్నారు.

        చదవండి:రెండు గంటల ఉత్కంఠకు తెర: భూమా, శిల్పా నామినేషన్లు సక్రమమే

ఈ నెల 23వ, తేదిన జరిగే ఉపఎన్నికల్లో విజయం కోసం రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు నంద్యాలలో మకాం వేశారు. దీంతో రెండు పార్టీల నేతలు తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం వ్యూహరచన చేస్తున్నారు.

జగన్‌ అంటే గౌరవం ఉంది.

జగన్‌ అంటే గౌరవం ఉంది.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ అంటే తమకు గౌరవం ఉందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ చెప్పారు. తానెప్పుడూ కూడ వైసీపీ చీఫ్ జగన్‌ను విమర్శించలేదన్నారు. కానీ, తన తండ్రిపై విమర్శలు చేసేందుకు వైసీపీ నేతలు ఎందుకు ఉత్సాహన్ని చూపుతున్నారని ఆమె ప్రశ్నించారు. తన తల్లిపై గౌరవం ఉంటే భూమా నాగిరెడ్డి చనిపోయిన సమయంలో ఎందుకు రాలేదని ఆమె రోజాను ప్రశ్నించారు.

YS Jagan Shock To Bhuma Akhila Priya
శిల్పా మోహన్‌రెడ్డిపైనే పోరాటం

శిల్పా మోహన్‌రెడ్డిపైనే పోరాటం

తమ పోరాటం జగన్‌పై కాదని, శిల్పా మోహన్‌రెడ్డిపైనే ఉందని మంత్రి అఖిలప్రియ చెప్పారు. ఎన్నో విధాలుగా తన తండ్రిని శిల్పా మోహన్‌రెడ్డి ఇబ్బందులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. శిల్పా మోహన్‌రెడ్డిపై పోరాటం చేస్తే దానిని మీకు వ్యతిరేకంగా తీసుకోవడం సరికాదన్నారామె. ఎవరో విమర్శలు చేస్తే తనపై విమర్శలు చేయడం సరైందికాదని ఆమె రోజాను అడిగారు.

డ్వాక్రా మహిళలపై శిల్పా వ్యాఖ్యలు సమర్థనీయమేనా?

డ్వాక్రా మహిళలపై శిల్పా వ్యాఖ్యలు సమర్థనీయమేనా?

డ్వార్నా మహిళలపై మాజీ మంత్రి శిల్పా మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమర్ధనీయమేనా అని ఆమె ఎమ్మెల్యే రోజాను ప్రశ్నించారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. నంద్యాల గురించి తాను మాట్లాడుతోంటే ఎవరో ఏదో మాట్లాడిన అంశాలను ప్రస్తావించడాన్ని మంత్రి తప్పుబట్టారు. డ్వాక్రా సంఘాలకు ఇచ్చిన హమీని చంద్రబాబునాయుడు విస్మరించారని రోజా ఆరోపించారు.

సినిమాల్లో పాత్రల గురించి మాట్లాడొచ్చా?

సినిమాల్లో పాత్రల గురించి మాట్లాడొచ్చా?

ఓ సినిమా ఫంక్షన్‌లో బాలకృష్ణ మహిళలపై చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రస్తావించారు. అసెంబ్లీలో తనను టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమ చేసిన విమర్శలపై కూడ ఆమె ప్రస్తావించారు. తాను సినిమాల్లో చేసిన పాత్రల గురించి టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శలు చేయడం సరైందేనా అంటూ రోజా ప్రశ్నించారు. తాను రాజకీయాలకు కొత్త అని, తాను రాజకీయాలు చేయడం నేర్చుకోలేదని మంత్రి అఖిలప్రియ సమాధానమిచ్చారు. చాలా ఓపెన్‌గా మాట్లాడతానని అకిలప్రియ చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
If there is a love on Bhuma Shobhanagi reddy why yscrp leders didnot attend Bhuma Nagireddy funeral asked Ap tourism minister Bhuma Akhilapriya.
Please Wait while comments are loading...