Year Ender 2025: ఈ ఏడాది టీడీపీ ఎక్కడ ? చంద్రబాబు, లోకేష్ గ్రాఫ్ మారిందా ?
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి భారీ విజయం సొంతం చేసుకున్న టీడీపీకి ఈ ఏడాది సానుకూలంగానే గడిచింది. ముఖ్యంగా ఈ ఏడాది తొలి అర్ధభాగం సంక్షేమ పథకాలతోనూ, ద్వితీయార్ధం అభివృద్ది, పెట్టుబడులు, అధినేతల విదేశీ పర్యటనలతోనూ సాగిపోయింది. ప్రజలకు గతేడాది ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవడంలో ఆరంభంలో విమర్శలు ఎదుర్కొన్న టీడీపీ.. చివరికి వచ్చే సరికి పూర్తి స్దాయిలో పరిస్దితిని తమకు అనుకూలంగా మార్చుకుంది.
ఈ ఏడాది ఆరంభించే నాటికి టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో పెన్షన్ పెంపు మినహా మిగతా కీలక హామీలు అమలు కాలేదు. దీంతో విపక్ష వైసీపీ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ వరుస ఆందోళనలకు పిలుపునిచ్చింది. దీని ద్వారా పెరిగిన ఒత్తిడో, లేక ఆర్ధిక పరిస్దితి సహకరించడం వల్లో కానీ ఏప్రిల్-మే నుంచి ప్రభుత్వం వరుసగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు వంటి కీలక పథకాల్ని అమలు చేసేసింది. దీంతో పాటు హామీ ఇవ్వని ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కూడా అమలు చేసింది.
తద్వారా సంక్షేమంలో శభాష్ అనిపించుకుంది.

ఇక మిగిలింది అభివృద్ది. దీనికి కీలకమైన పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా విదేశీ పర్యటనలకు తెరలేపారు. వరుసగా దావోస్, సింగపూర్, లండన్.. ఇలా వరుస టూర్లు వెళ్తూ అక్కడి పెట్టుబడిదారుల్ని రాష్ట్రానికి ఆహ్వానించారు. దీని ఫలితమే తాజాగా విశాఖకు వచ్చిన గూగుల్ ఏఐ డేటా సెంటర్. దీంతో పాటు దాదాపు 14 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనల్ని ప్రభుత్వం విశాఖ సీఐఐ సదస్సు ద్వారా సాధించింది. ఇప్పుడు వీటిలో సగం గ్రౌండ్ చేయగలిగినా ప్రభుత్వానికి పెద్ద విజయంగానే చెప్పవచ్చు.

అలాగే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు నిధుల్ని తెచ్చుకునే విషయంలోనూ చంద్రబాబు సర్కార్ ఎంతో ముందుంది. వీటితో పాటు కీలకమైన అమరావతి రాజధాని నిర్మాణం విషయంలో ఈ ఏడాది కీలక అడుగులు వేసింది. ముఖ్యంగా ప్రధాని మోడీతో అమరావతి పనుల పునఃప్రారంభం చేయించడంతో పాటు ప్రపంచబ్యాంక్, ఏడీబీ నుంచి రుణాలు తెచ్చుకుంటోంది. వీటితో అమరావతిలో పనుల్ని పరుగులు తీయిస్తోంది. ఇప్పటికే సీఆర్డీయే భవనం నిర్మాణం పూర్తయి ప్రారంభం కూడా అయింది. దీంతో పాటు మంత్రులు, అధికారుల క్వార్టర్స్.. ఇతర నిర్మాణాలు కూడా వేగంగా సాగుతున్నాయి. అదే సమయంలో జాతీయ స్ధాయిలో చంద్రబాబు, లోకేష్ ల గ్రాఫ్ కూడా పెరుగుతోంది. ప్రధాని మోడీ ఇప్పుడు వీరిద్దరికీ అడగ్గానే అపాయింట్ మెంట్లు ఇచ్చే పరిస్ధితి ఉంది. ేే
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
చంద్రబాబుపై మూడు పిటిషన్లు- హైకోర్టు కీలక నిర్ణయం..! -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది!











Click it and Unblock the Notifications