మెడికల్ కాలేజీల పై వ్యూహం మార్చిన వైసీపీ, ఢిల్లీ కేంద్రంగా..!!
ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఏపీలో మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు నిర్వహిస్తోంది. కోటి సంతకాల సేకరణ తో ఈ నెల 17న మాజీ సీఎం జగన్ గవర్నర్ తో భేటీ కానున్నారు. ప్రభుత్వం మాత్రం పీపీపీ విధానం సరైనదిగా వాదిస్తోంది. కాగా, ఈ సమయంలో వైసీపీ మెడికల్ కాలేజీల అంశాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లింది. ఢిల్లీ కేంద్రంగా వైసీపీ తమ ఆందోళన వివరించే ప్రయత్నం చేస్తోంది.
ఏపీలో మెడికల్ కాలేజీల అంశం పైన వైసీపీ పోరు తీవ్రతరం చేసింది. ఇప్పటికే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా కోటీ సంతకాల సేకరణ చేసింది. ఈ నెల 17న గవర్నర్ వద్దకు కోటి సంతకాలతో మాజీ సీఎం జగన్ వెళ్లి కలిసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కాగా, తాజాగా వైసీపీ ఎంపీల బృందం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రైవేటీకరణ జరగకుండా చర్యలు తీసుకో వాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలే సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థల కు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, దీనివల్ల పేద, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్య అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీల భూములను తక్కువ ధరలకు ప్రైవేటు సంస్థలకు లీజ్ ఇవ్వాలనే ఆలోచనలు కూడా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని, ఇదే సమయంలో ప్రభుత్వ వైద్య సేవలలో నాణ్యత లోపించి, సామాన్య ప్రజలకు వైద్యం దూరం అవుతుందని వివరించారు. వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన 17 కొత్త మెడికల్ కాలేజీలలో 7 ఇప్పటికే పూర్తి చేసి, పేద మరియు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం ఎంపీలు మంత్రికి గుర్తుచేశారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రజల ఆందోళన వ్యక్తమవుతున్నదని, ఇప్పటివరకు ఒక కోటి కంటే ఎక్కువ సంతకాలు సేకరించబడినట్లు ఎంపీలు వివరించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలంటూ వైయస్ఆర్సీపీ ఎంపీలు కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications