పిన్నెల్లి బ్రదర్స్ కు మరో షాక్..! కోర్టు మరో కీలక ఆదేశం..!
ఏపీలో పల్నాడు రాజకీయాల్లో కీలక వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు ఇవాళ మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన నేతల జంట హత్యల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరు ప్రస్తుతం జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఈ రిమాండ్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇవాళ వీరిద్దరినీ నరసరావుపేట జూనియర్ సివిల్ జడ్జి ముందు వర్చువల్ గా పోలీసులు హాజరుపర్చారు.
టీడీపీ నాయకుల జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి గతంలో కోర్టు విధించిన రిమాండ్ ను మరో రెండు వారాల పాటు పొడిగించాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది. దీనిపై విచారణ జరిపిన జూనియర్ సివిల్ జడ్డి.. జనవరి 7వ తేదీ వరకూ రిమాండ్ పొడిగిస్తూ ఇవాళ ఆదేశాలు ఇచ్చారు. దీంతో వీరిద్దరూ జనవరి 7 వరకూ జైల్లోనే ఉండాల్సిన పరిస్ధితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది.

గతేడాది పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య కేసులో పిన్నెల్లి సోదరులపై ఈ ఏడాది మే 25న పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ6గానూ, పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని ఏ7గానూ ఉన్నారు. ఈ కేసులో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయిచిన పిన్నెల్లి సోదరులకు తాత్కాలిక ఊరట దక్కింది. దీనిపై తిరిగి ప్రభుత్వం బెయిల్ షరతుల ఉల్లంఘించారంటూ కోర్టును ఆశ్రయించింది. దీంతో అది కాస్తా రద్దయింది. అనంతరం వీరిద్దరూ గత నెలలో మాచర్ల కోర్టులో లొంగిపోయారు. అనంతరం వీరిద్దరికీ రిమాండ్ విధించారు. అందులో భాగంగానే వీరు జైలు జీవితం గడుపుతున్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications