గ్రహాంతర వాసుల ఆచూకీ లభించిందా? డిసెంబర్ 14న ‘నాసా’ కీలక ప్రకటన దానిగురించేనా!?
వాషింగ్టన్: అంతరిక్ష రంగంలో ఎన్నెన్నో మైలురాళ్లు అధిగమిస్తున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు. గ్రహాంతర వాసులు ఉన్నారా? ఇదీ ఆ ప్రశ్న.
ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా నాసా శాస్త్రవేత్తలకు ఓ కొత్త విషయం తెలిసిందట. అదేంటన్నది డిసెంబర్ 14న వారు ప్రకటించబోతున్నట్లు తెలిసింది.

నిజానికి గ్రహాంతర వాసుల ఉనికిని కనుగొనేందుకు నాసా కెప్లర్ టెలిస్కోప్ సహాయంతో 2009 నుంచి పరిశోధనలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలకు భూమిని పోలిన 2500కు పైగా గ్రహాలు కనిపించాయట.
కెప్లర్ టెలిస్కోప్ గుర్తించిన గ్రహాలను గూగుల్ సంస్థ అందించిన మెషిన్ లెర్నింగ్ విధానం ద్వారా నాసా శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ గ్రహాలన్నీ 'గోల్డీలాక్ జోన్'లోనే పరిభ్రమిస్తున్నాయని, జీవజాలం అభివృద్ధికి ఈ గ్రహాల పరిస్థితులు అనుకూలిస్తాయని గతంలోనే వెల్లడించారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 14న నాసా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఓ సంచలన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ గ్రహాల్లో ఏదో ఒక గ్రహంలో జీవం జాడలు కనిపించి ఉంటాయని, ఆ విషయాన్నే నాసా శాస్త్రవేత్తలు ప్రకటించబోతున్నారనేది విశ్లేషకులు అభిప్రాయం.
-
Gmail ఐడీ నచ్చలేదా? ఈ సింపుల్ ట్రిక్ తో వెంటనే యూజర్ నేమ్ ఛేంజ్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications