ఆటోమొబైల్ ఆస్కార్స్: 2026 కార్, బైక్ ఆఫ్ ది ఇయర్ ఇవే!
భారత ఆటోమొబైల్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్'(ICOTY), 'ఇండియన్ మోటార్ సైకిల్ ఆఫ్ ది ఇయర్'(IMOTY) 2026 విజేతలను ప్రకటించారు. ఈ ఏడాది మార్కెట్లో సంచలనం సృష్టించిన మారుతి సుజుకి విక్టోరిస్, టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 310 అగ్రస్థానంలో నిలిచాయి. జేకే టైర్ ఆధ్వర్యం జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో వివిధ కేటగిరీల్లో విజేతలుగా ఈ వాహనాలు నిలిచాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
1. ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్: మారుతి సుజుకి విక్టోరిస్
ఈ రేసులో మారుతి విక్టోరిస్ గట్టి పోటీని ఎదుర్కొని విజేతగా నిలిచింది. స్కోడా కైలాక్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా.. మహింద్రా ఎక్స్ఈవీ 9ఈ మూడో స్థానాన్ని దక్కించుకుంది. టాటా హారియర్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఈవీ వంటి దిగ్గజ కార్లు కూడా ఈ రేసులో ఉండటం గమనార్హం.

2. ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్: టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 310
టూ వీలర్ విభాగంలో టీవీఎస్ అపాచీ తన సత్తా చాటింది. కేటీఎం 390 అడ్వెంచర్, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650, యమహా ఎక్స్ఎస్ఆర్ 155 వంటి శక్తివంతమైన బైకులను వెనక్కి నెట్టి అపాచీ ఆర్టీఎక్స్ 310 ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవసం చేసుకుంది.
3. గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్: మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ
పర్యావరణ హితమైన వాహనాల విభాగంలో మహింద్రా ఎలక్ట్రిక్ ఎస్యూవీ 'ఎక్స్ఈవీ 9ఈ' అగ్రస్థానంలో నిలిచింది. ఈ విభాగంలో టెస్లా మోడల్ వై, బీవైడీ సీలయన్ 7, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వంటి కార్లతో ఇది పోటీ పడింది.
4. ప్రీమియం కార్ ఆఫ్ ది ఇయర్: ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ
లగ్జరీ, పర్ఫార్మెన్స్ విభాగంలో ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ అవార్డును గెలుచుకుంది. బీఎమ్‌డబ్ల్యూ iX1, మెర్సిడెస్ బెంజ్ జి-క్లాస్, టయోటా కామ్రీ వంటి కార్లు ఈ కేటగిరీలో నామినేట్ అయ్యాయి.
విజేతల జాబితా సంక్షిప్తంగా..
*ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ (ICOTY) -మారుతి సుజుకి విక్టోరిస్
*ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ (IMOTY)- టీవీఎస్ అపాచీ ఆర్టీఎక్స్ 310
*ప్రీమియం కార్ ఆఫ్ ది ఇయర్-ఫోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ జీటీఐ
*గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ (EV)-మహీంద్రా ఎక్స్ఈవీ 9ఈ
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications