BitCoin బేజారు.. వాల్ స్ట్రీట్ పెద్దలు ఎంట్రీనే కొంప ముంచిందా?
ఒకప్పుడు ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బిట్‌కాయిన్ (BitCoin), ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. ఒకవైపు బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయి గరిష్టాలను తాకుతుంటే.. డిజిటల్ గోల్డ్‌గా పేరు తెచ్చుకున్న బిట్‌కాయిన్ మాత్రం ఒత్తిడిలో కూరుకుపోతోంది.
సరిగ్గా ఇదే సమయంలో ప్రముఖ ఆర్థికవేత్త పీటర్ షిఫ్ చేసిన విమర్శలు ఇప్పుడు ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. "ఎప్పుడైతే వాల్ స్ట్రీట్ పెద్దలు బిట్‌కాయిన్‌లోకి ప్రవేశించారో, అప్పుడే దాని దశ తిరగబడింది" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రిప్టో మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారాయి.

వాల్ స్ట్రీట్ వల్లే BitCoin ఇలా?
బంగారం మీద అమితమైన నమ్మకం ఉన్న పీటర్ షిఫ్, బిట్‌కాయిన్ పతనాన్ని ఎద్దేవా చేస్తున్నారు. ఆయన విశ్లేషణ ప్రకారం.. బిట్‌కాయిన్ అనేది కొద్దిమంది చేతుల్లో ఉన్నప్పుడే అది అద్భుతమైన లాభాలను ఇచ్చింది. కానీ, ఎప్పుడైతే సంస్థాగత పెట్టుబడిదారులు, పెద్ద పెద్ద కంపెనీలు (Wall Street) దీనిని స్వీకరించడం మొదలుపెట్టాయో, అప్పటి నుండే దీని పనితీరు మందగించింది. "చాలామంది కొనుగోలు చేసినప్పటి నుండి, ఇది అత్యంత తక్కువ పనితీరు చూపిస్తున్న ఆస్తిగా మారిపోయింది" అని ఆయన కుండబద్దలు కొట్టారు. నవంబర్ 2021తో పోలిస్తే, బంగారం విలువ పరంగా బిట్‌కాయిన్ 50 శాతం పడిపోయిందని ఆయన గణాంకాలతో సహా నిరూపిస్తున్నారు.
వెండి విన్యాసాలు.. బిట్‌కాయిన్ బేజారు
ప్రస్తుతం మార్కెట్లో వెండి ధరలు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. వెండి ధర 98.35 డాలర్లకు చేరుకుని, 100 డాలర్ల మార్కుకు కేవలం రెండు అడుగుల దూరంలో నిలిచింది. ఈ ఏడాదిలోనే వెండి 35 శాతం పెరగడం విశేషం. మరోవైపు బిట్‌కాయిన్ ధర 88,959.08 డాలర్ల వద్ద ఊగిసలాడుతోంది. ఒకప్పుడు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే ఆస్తిగా బిట్‌కాయిన్‌ను భావించేవారు, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే సంప్రదాయ ఆస్తులైన బంగారం, వెండి వైపే ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.
2022 నాటి సీన్ రిపీట్ అవుతుందా?
ప్రస్తుత పతనాన్ని చూస్తుంటే చాలామందికి 2022 నాటి చేదు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఆ సమయంలో వడ్డీ రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం వల్ల బిట్‌కాయిన్ తన విలువలో 60 శాతానికి పైగా కోల్పోయింది. అయితే, ఈ పోలిక తప్పు అని కొందరు విశ్లేషకులు వాదిస్తున్నారు. క్రిప్టో నిపుణుడు గారెట్ బుల్లిష్ అభిప్రాయం ప్రకారం.. 2022 నాటి పరిస్థితులకు, ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పుడు ద్రవ్యోల్బణం తగ్గుముఖం పడుతోందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి కొత్త సాంకేతికతల వల్ల ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తున్నాయని ఆయన అంటున్నారు. దీర్ఘకాలంలో బిట్‌కాయిన్ మళ్ళీ పుంజుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
మార్కెట్లో ప్రస్తుతం ఒక రకమైన గందరగోళం నెలకొంది. పీటర్ షిఫ్ వంటి వారు ఇది "క్రిప్టో ముగింపు" అని చెబుతుంటే, మరికొందరు ఇది కేవలం "తాత్కాలిక ఒత్తిడి" మాత్రమే అని కొట్టిపారేస్తున్నారు. అయితే, వాల్ స్ట్రీట్ జోక్యం పెరగడం వల్ల బిట్‌కాయిన్ అస్థిరత (Volatility) పెరిగిందన్నది మాత్రం వాస్తవం.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications