బంగారం Vs వెండి: ఏది బెటర్? మీ సంపదను 3 రెట్లు పెంచుకునే ఫార్ములా ఇదే!
ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రికార్డు స్థాయికి చేరుతున్న పసిడి ధరలను చూసి సామాన్యులు ఆందోళన చెందుతుంటే ప్రముఖ ఆర్థిక నిపుణులు ఆనంద్ శ్రీనివాసన్ మాత్రం ఓ ఆసక్తికరమైన విశ్లేషణను ముందుకు తెచ్చారు. బంగారం కొనుగోలు చేయడం ద్వారా సంపదను ఎలా సులభంగా సృష్టించవచ్చో ఆయన వివరించారు.
సీక్రెట్ ఫార్ములాను వెల్లడించిన నిపుణులు
బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక అద్భుతమైన పెట్టుబడి సాధనమని ఆయన పేర్కొన్నారు. ఒక ఉదాహరణతో ఆయన ఇలా వివరించారు. మీరు ఒక ఐదు లేదా ఏడేళ్ల క్రితం ఇల్లు కొనాలని అనుకున్నారనుకోండి. ఆ ఇంటి కోసం మీరు భారీ మొత్తంలో హోమ్ లోన్ తీసుకుని ఉండేవారు. కానీ ఆ సొమ్ముతో అప్పట్లో మీరు బంగారం కొనుగోలు చేసి ఉంటే, నేడు దాని విలువ 3 నుంచి 4 రెట్లు పెరిగి ఉండేది. మీరు పెట్టిన పెట్టుబడి నేడు మూడు రెట్లు అయ్యి ఉంటే.. అందులో ఒక వంతు బంగారాన్ని అమ్మి ఇంటి లోన్ తీర్చేయవచ్చు, రెండో వంతుతో ఇల్లు కొనవచ్చు, మూడో వంతు బంగారం మీ వద్ద అలాగే మిగిలి ఉండేది. అంటే మీరు పెట్టిన ప్రతి రూపాయి నేడు మీకు మూడు రూపాయల లాభాన్ని తెచ్చిపెట్టి ఉండేదని ఆయన విశ్లేషించారు.

బంగారం Vs వెండి: ఏది బెటర్?
చాలామంది వెండిపై కూడా పెట్టుబడి పెడుతుంటారు. అయితే వెండి కంటే బంగారమే మేలని ఆయన అభిప్రాయపడ్డారు. బంగారాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా నగదుగా మార్చుకోవచ్చు.వెండిని విక్రయించేటప్పుడు కొనుగోలు ధరకు, అమ్మకం ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటుంది. ఒకవేళ కుదువ పెట్టినా, వెండి విలువలో కేవలం 20 శాతం మాత్రమే రుణం లభిస్తుంది, కానీ బంగారానికి 75శాతానికి పైగా రుణం లభిస్తుంది.
డబ్బును ఎక్కడ దాచుకోవాలి?
డబ్బును బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ఆనంద్ శ్రీనివాసన్ హెచ్చరించారు. బ్యాంకు ఇచ్చే వడ్డీ రేటు ద్రవ్యోల్బణం (వస్తువుల ధరల పెరుగుదల) కంటే తక్కువగా ఉంటుంది. దీనివల్ల కాలక్రమేణా మీ డబ్బు విలువ తగ్గిపోతుంది. మరోవైపు షేర్ మార్కెట్‌లో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. బంగారం ధరలు అప్పుడప్పుడు స్థిరంగా ఉన్నట్లు అనిపించినా, దీర్ఘకాలంలో బంగారం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. ఇది సురక్షితమైన పెట్టుబడి.
గమనిక: ఇది ఒక వార్తా కథనం మాత్రమే. దీనిని పెట్టుబడి సలహాగా పరిగణించవద్దు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications