బిగ్గెస్ట్ డీల్ రూ.6.47 లక్షల కోట్లు.. నెట్‌ఫ్లిక్స్ చేతికి వార్నర్ బ్రదర్స్ !!
ప్రపంచ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. దశాబ్దాల చరిత్ర కలిగిన హాలివుడ్ లో పేరొందిన "వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ" తో నెట్‌ఫ్లిక్స్ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ అనూహ్య ఒప్పందం మొత్తం ఫిల్మ్, టెలివిజన్, స్ట్రీమింగ్ రంగాల్లో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
రూ.6.47 లక్షల కోట్ల డీల్..
ఈ ఒప్పందం విలువ 72 బిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.6.47 లక్షల కోట్లు. వినోదరంగంలో ఇంత పెద్ద మొత్తంలో కొనుగోలు చాలా అరుదుగా జరుగుతుంది. ఒక్కో వార్నర్ బ్రదర్స్ షేరుకు 27.75 డాలర్లు ఇచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్ సిద్ధపడటం.. ఈ డీల్‌పై ఆ సంస్థ ఎంతగా దృష్టి సారించిందో బయటపెడుతోంది. ఈ మొత్తం కేవలం స్టూడియో భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే కాకుండా వార్నర్ బ్రదర్స్ కలిగిన భారీ కంటెంట్ లైబ్రరీ, టెలివిజన్ నెట్వర్క్స్, స్ట్రీమింగ్ మౌలిక వసతులు సహా అన్నింటికీ వర్తిస్తుంది.

శతాబ్దం చరిత్ర కలిగిన స్టూడియో..
వార్నర్ బ్రదర్స్ అనేది అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దిగ్గజ కంపెనీ. 100 ఏళ్లు దాటిన ఈ స్టూడియో, హాలివుడ్ గోల్డెన్ ఏజ్ నుంచి నేటి బ్లాక్ బస్టర్ యుగం వరకు ఎనలేని సేవ చేసింది. వేల సంఖ్యలో సినిమాలు, వందల సంఖ్యలో టీవీ షోలు, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసిన IPలు (Intellectual Properties) - ఇవన్నీ నెట్‌ఫ్లిక్స్‌కు చేరడం స్ట్రీమింగ్ భవిష్యత్తును పూర్తిగా మార్చబోతోంది. ఇప్పటి వరకు లైసెన్స్‌పై ఆధారపడిన నెట్‌ఫ్లిక్స్, మొదటిసారి ఒక పూర్తిస్థాయి స్టూడియో సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటోంది.
కాగా ఈ కొనుగోలు పూర్తయితే నెట్‌ఫ్లిక్స్ చేతుల్లోకి చేరే కంటెంట్ లిస్ట్ అసాధారణం అని భావించవచ్చు. The Sopranos, The White Lotus, Game of Thrones, Succession వంటి ప్రపంచవ్యాప్త పాపులర్ షోలు నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫాంలో ప్రత్యక్షమవుతాయి.
Harry Potter ఫిల్మ్ సిరీస్
The Lord of the Rings లో కొన్ని డిస్ట్రిబ్యూషన్ రైట్స్
DC Universe Content (Batman, Superman, Joker, Wonder Woman)లోని భాగాలు
Friends వంటి చారిత్రాత్మక టీవీ షోలు
ఇటీవలి సంవత్సరాల్లో డిస్నీ+, ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ+ వంటి ప్లాట్‌ఫార్ములు కంటెంట్ పోటీని తీవ్రం చేశాయి. ప్రేక్షకులను నిలుపుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌కు కంటెంట్ అవసరం. లైసెన్స్ ఫీజులు పెరిగిపోవడంతో, ఇతర సంస్థలు తమ కంటెంట్‌పై ప్రత్యేక హక్కులు పెంచడంతో.. నెట్‌ఫ్లిక్స్ తమ భవిష్యత్తు సేఫ్టీ కోసం ఈ కొనుగోలు చేసిందని భావిస్తున్నారు.
కాగా వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ప్రస్తుతం నిర్వహిస్తున్న కేబుల్ నెట్వర్క్స్ - CNN, TNT, TBS - ఇప్పటికే రీ స్ట్రక్చరింగ్ దశలో ఉన్నాయి. ఈ మార్పులు పూర్తయ్యాకే ఫైనల్ కొనుగోలు ప్రాసెస్‌కి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఈ ఛానెళ్లలో ఉద్యోగ మార్పులు, కంటెంట్ రీషఫ్లింగ్, మేనేజ్మెంట్ మార్పులు జరగొచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఈ డీల్ విజయవంతమైతే, స్ట్రీమింగ్ రంగంలో అత్యున్నత కంటెంట్‌ను పులిహోరలా కలిపి అందించగల ఏకైక సంస్థ నెట్‌ఫ్లిక్స్ అవుతుంది. ప్రేక్షకులు ఒకే యాప్‌లో HBO లెజెండరీ షోలు, వార్నర్ క్లాసిక్ ఫిల్మ్స్, నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ అన్నీ చూడగలుగుతారు.
-
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications