RBI:భారీగా తగ్గనున్న వడ్డీ రేట్లు? ఫిబ్రవరి 6న గుడ్ న్యూస్!
దేశ ఆర్థిక వ్యవస్థ మరో కీలక మలుపు వద్ద నిలిచింది. ఫిబ్రవరి 6న జరిగే భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన సమీక్షపై బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ రంగాలతో పాటు సామాన్యులు హోమ్ లోన్ (Home Loan) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, రెపో రేటు (Repo Rate)ను 0.25 శాతం తగ్గించే అవకాశాలు బలంగా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్థికవేత్తలు అంచనా వేయడం మార్కెట్లో కొత్త చర్చకు తెరలేపింది. ఈసారి వడ్డీ రేట్ల తగ్గింపు జరిగితే, ఇది ప్రస్తుత చక్రంలో చివరి కోత కావచ్చని వారు స్పష్టం చేయడం విశేషం. అంటే, ఆర్బీఐ ఇకపై 'వేచి చూసే' ధోరణిలోకి వెళ్లే అవకాశం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ద్రవ్యోల్బణం అదుపులోనే కొనసాగుతుందన్న అంచనాలు, మరోవైపు ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదాలు.. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే ఆర్బీఐ ముందున్న అసలు సవాలు. బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక ప్రకారం, ఆర్థిక వృద్ధిలో అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో రెపో రేటును 5.25 శాతానికి తీసుకురావడానికి ఆర్బీఐ తన అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది ఒక రకంగా వృద్ధికి ఊతమిచ్చే ప్రయత్నంగా నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వినియోగ ఖర్చులు, పెట్టుబడులను పెంచేందుకు తక్కువ వడ్డీ రేట్లు కీలకంగా మారనున్నాయి.

RBI Repo Rate ప్రభావం..
రెపో రేటు తగ్గితే దాని ప్రత్యక్ష ప్రభావం గృహ రుణాలపైనే పడుతుంది. ఉదాహరణకు.. రూ.50 లక్షల హోమ్ లోన్ 20 సంవత్సరాల కాలానికి9 శాతం వడ్డీతో తీసుకున్న వారు ప్రస్తుతం సుమారు రూ.44,986.. వడ్డీ రూపంలో చెల్లిస్తున్నారు. వడ్డీ రేటు 0.25 శాతం తగ్గి 8.75 శాతానికి వస్తే, EMI సుమారు రూ.44,186కి తగ్గుతుంది. అంటే ప్రతి నెలా దాదాపు రూ. 800 ఆదా. దీర్ఘకాలంలో చూస్తే, మొత్తం రుణ కాలంలో సుమారు రూ.1.9 లక్షల వరకు వడ్డీ భారం తగ్గుతుంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటే.
EMI తగ్గాలా? లేక రుణ కాలం తగ్గాలా?
ఇక్కడ మరో కీలక సెలక్షన్ కూడా ఉంది. EMI తగ్గించకుండా, పాత EMIనే కొనసాగిస్తే.. రుణ కాలపరిమితి సుమారు 10 నుంచి 12 నెలలు తగ్గుతుంది. దీంతో రుణం ఒక ఏడాది ముందే పూర్తవడమే కాకుండా, మొత్తం వడ్డీ ఆదా రూ. 4 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలికంగా ఇది ఆర్థికంగా చాలా లాభదాయకమైన మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా బ్యాంకులు వడ్డీ తగ్గినప్పుడు EMI అదే ఉంచి, రుణ కాలాన్ని ఆటోమేటిక్‌గా తగ్గిస్తాయి. EMI తగ్గించుకోవాలనుకుంటే మాత్రం బ్యాంకును సంప్రదించి ప్రత్యేకంగా అభ్యర్థించాల్సి ఉంటుంది.
లిక్విడిటీ...
రెపో రేటుతో పాటు మార్కెట్లో నగదు లభ్యతను పెంచడంపైనా ఆర్బీఐ దృష్టి సారిస్తోంది. ఇప్పటికే సుమారు రూ. 2 లక్షల కోట్ల ద్రవ్య లభ్యత అందించిన ఆర్బీఐ, అవసరమైతే మరిన్ని చర్యలకు సిద్ధంగా ఉందని సంకేతాలు ఇస్తోంది. మార్కెట్లో స్థిరత్వం కొనసాగాలంటే లిక్విడిటీ కీలకమని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రూపాయి, గ్లోబల్ టెన్షన్లు... నిర్ణయంపై ఎంత ప్రభావం?
అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ, అవి ఈసారి వడ్డీ రేట్ల నిర్ణయాన్ని గణనీయంగా ప్రభావితం చేయబోవని నిపుణుల అంచనా. ఫిబ్రవరి సమావేశంలో కోత జరిగితే.. అదే చివరిది కావచ్చని, లేదంటే భవిష్యత్తుకు అవకాశాలు తెరిచి ఉంచుతారని వారు భావిస్తున్నారు.
చిత్రమేమిటి?
డిసెంబర్‌తో పోలిస్తే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితులు కొంత మెరుగయ్యాయని నివేదికలు సూచిస్తున్నాయి. ద్రవ్యోల్బణం ఆర్బీఐ అంచనాల కంటే తక్కువగా ఉండే అవకాశం, పారిశ్రామిక, వినియోగ రంగాల్లో సానుకూల సంకేతాలు.. ఇవన్నీ విధాన నిర్ణేతలకు ఊరట కలిగించే అంశాలుగా మారాయి. ఫిబ్రవరి 6న ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది కేవలం వడ్డీ రేట్లకే కాదు... సామాన్య హోమ్ లోన్ భవిష్యత్ ప్లానింగ్‌కూ కీలకంగా మారబోతోంది.
-
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications