ఆ కరెన్సీ నోట్లపై కొత్త సమస్య, నిబంధనలు మార్చాల్సిందే

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత చిరిగిపోయిన లేదా పాడైన రూ. 200, రూ.2000 నోట్ల మార్పిడి బ్యాంకర్లకు ఇబ్బందిగా మారింది. ఈ మేరకు ఆర్బీఐ చట్ట నిబంధనలను సవరించాలంటూ బ్యాంకర్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరింది.
తాజా కరెన్సీ నోట్లకు అనుగుణంగా 'నోట్ రీఫండ్' చట్ట నిబంధనలో తాజా మార్పులు చేపట్టకపోవడంతో ఈ నోట్ల మార్పిడికి అవకాశం లేదు. దీంతో ఎక్చేంజ్ కౌంటర్లలో పాడైపోయిన , దెబ్బతిన్న కరెన్సీ నోట్లు భారీగా పేరుకుపోయాయి. కానీ, పెద్ద నోట్ల రద్దు తర్వాత కొత్తగా చలామణిలోకి వచ్చిన రూ. 200, రూ2వేల కరెన్సీ నోట్లు ఈ జాబితాలోకి రాలేదు.

ఈ చట్ట సవరణ అవసరంపై ఆర్థిక మంత్రిత్వ శాఖకు ఇప్పటికే నివేదించామని ఆర్‌బీఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు.మరోవైపు చలామణిలో రూ.500, రూ.200, రూ.100 నోట్లు చాలినన్ని ఉన్నాయని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ప్రకటించారు.
సుమారు రూ.7 లక్షల కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణిలో ఉన్నాయని ఆయన ప్రకటించారు. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూ.2,000 నోట్ల ముద్రణ నిలిపివేసిందని కూడా స్పష్టం చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!