హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

20 రోజుల క్రితం డీల్.. కాల్పులు ఇలా జరిపారు.. శ్రీను, రఘు హత్యలపై సీపీ మహేశ్

|
Google Oneindia TeluguNews

ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఆరుగురిని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. 1వ తేదీన ఇబ్రహీంపట్నంలో కాల్పులు జరిగాయని తమకు ఫిర్యాదు వచ్చిందన్నారు. రియల్ ఎస్టేట్ శ్రీనివాస్ రెడ్డి స్పాట్‌లో చనిపోయాడన్నారు. మరో రియల్ ఎస్టేట్ వ్యాపారీ రాఘవేందర్ రెడ్డి హాస్పిటల్‌లో మృతి చెందాడన్నారు. లేక్ వ్యూ వెంచర్ ఫ్లాట్స్ గొడవలో కాల్పులు జరిగాయని తెలిసిందన్నారు. సైంటిఫిక్ ఆధారాలతో, సీసీ ఫుటేజ్, సీడీఅర్ అనాలిసిస్‌తో కేసును ఛేదించామని వివరించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామని సీపీ పేర్కొన్నారు.

మట్టారెడ్డి అలియాస్ భిక్షపతి

మట్టారెడ్డి అలియాస్ భిక్షపతి


ప్రధాన నిందితుడు మట్టా రెడ్డి అలియాస్ భిక్షపతి కీలక నిందితుడని తెలిపారు. గెస్ట్‌హౌస్‌లో పనిచేస్తున్న మోహినిద్దున్ ఈ కేసులో మరో కీలక నిందితుడు అని వివరించారు. సయ్యద్ రహీమ్, సమీర్ అలీ బీహార్, రాజు ఖాన్ బీహార్, ఫైర్ ఆమ్స్ వాడారని సీపీ తెలిపారు. భిక్షపతి, ఖాజా మోహీనిద్దున్ కాల్పులు జరిపారన్నారు. రెండు వేపన్స్‌ను సీజ్ చేశామని.. కంట్రీ మెడ్ పిస్టోల్స్ 19 రౌండ్స్, బుల్లెట్ వాహనం, హోండా అమేజ్ కార్, 6 సెల్‌ఫోన్స్, డాక్యుమెంట్లు సీజ్ చేసామని సీపీ తెలిపారు.

ఆరుగురి అరెస్ట్

ఆరుగురి అరెస్ట్

మట్టారెడ్డి, మోహినుద్దీన్, బిక్షపతి, రహీమ్, సమీర్, రాజు ఖాన్‌ను అరెస్ట్ చేశామన్నారు. వీరిలో ఇద్దరు బీహార్ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. మోహినుద్దీన్, బిక్షపతి ఇద్దరు కాల్పులు జరిపారని పేర్కొన్నారు. వీరి దగ్గరి నుంచి రెండు కంట్రీ మెడ్ పిస్టల్స్, కారు, 6 సెల్‌ఫోన్లు, మట్టా రెడ్డికి సంబందించిన కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రియల్ ఎస్టేట్ తగాదాలతో తొలిసారి కాల్పుల ఘటన జరిగిందన్నారు. మట్టా రెడ్డిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని చెప్పారు. జోతిష్యుడి సలహాతో తన పేరును మట్టా రెడ్డి మార్చుకున్నాడన్నారు. లేక్ విలా లే అవుట్‌లో శ్రీనివాస్, రాఘవ 14 ఎకరాలు కొన్నారన్నారు. మట్టా రెడ్డికి శ్రీనివాస్, రాఘవ పలుమార్లు బెదిరింపులు వచ్చాయన్నారు.

20 రోజుల క్రితం డీల్

20 రోజుల క్రితం డీల్


బీహార్‌కు చెందిన వారితో 20 రోజుల క్రితం మట్టా రెడ్డి డీల్ కుదుర్చుకున్నాడని వివరించారు. ఫిబ్రవరి 20న కాల్పులకు అటెంప్ట్ చేశారన్నారు. మార్చి 1న మాట్లాడుదాం రమ్మని మట్టా రెడ్డి చెప్పాడని పేర్కొన్నారు. ఇంటి నుంచి వస్తున్న శ్రీనివాస్ రెడ్డి, రాఘవ రెడ్డిను మొహినుద్దీన్ లిఫ్ట్ అడిగాడన్నారు. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న శ్రీనివాస్ రెడ్డిపై మొదట కాల్పులు జరిపారన్నారు. శ్రీనివాస్ రెడ్డిని ఛేజ్ చేస్తూ బిక్షపతి కాల్పులు జరిపారన్నారు. రాఘవ రెడ్డిపై మోహినుదీన్ కాల్పులు జరిపాడన్నారు. కాల్పుల తరువాత బిక్షపతి, మోహినుద్దెన్ ఒక గెస్ట్ హౌస్‌కు వెళ్లి తుపాకీ దాచి పెట్టారని ఆయన పేర్కొన్నారు.

1.20 లక్షలకు డీల్

1.20 లక్షలకు డీల్

అక్కడి నుంచి సొంత గ్రామానికి వెళ్లారని ఆయన తెలిపారు. 1.20 లక్షల సుపారి డీల్‌ను మట్టా రెడ్డి కుదుర్చుకున్నాడన్నారు. మట్టా రెడ్డి గెస్ట్ హౌస్‌లో ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో మోహినుద్దీన్ పరిగెత్తుకుంటూ వచ్చిన ఫుటేజ్ కీలకంగా మారిందన్నారు. శ్రీనివాస్, రాఘవను చంపేస్తే మొహినుద్దెన్, బిక్షపతికు లేక్ వీలాలో ప్లాట్‌లు ఇప్పిస్తా అని డీల్ కుదుర్చుకున్నట్లు సీపీ తెలిపారు. కేసులో పోలీసులకు మట్టా రెడ్డి సహకరించలేదని సీపీ హేష్ భగవత్ పేర్కొన్నారు.

English summary
20 days before plan for srinivas reddy and raghavender reddy murder rachakonda cp mahesh bhagavat said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X