అనసూయ ఆగ్రహాం: నెటిజన్‌ను ఏకిపారేసిన యాంకర్.. అయ్యో కిడ్ అంటూ
ఈ మధ్య నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. రకరకాల ట్రోల్ చేస్తున్నారు. అందుకు సెలబ్రిటీస్ కూడా అదేవిధంగా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో ముందువరసలో నిలిచేది యాంకర్ అనసూయ. నెటిజన్లకు తనదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల ఓ యూజర్ కామెంట్ చేయగా.. రిప్లై ఇచ్చారు. సరేనని సారీ కూడా చెప్పాడు. కానీ అనసూయ మాత్రం వినిపించుకోలేదు. అయ్యో అమ్మ నువ్ ఇంకా కిడ్.. చిన్న పిల్లాడివే అంటూ రాశారు.
ఇటీవల లంగా వోణీలో దిగిన ఫొటోను అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ ఫొటోలోని అనసూయ స్టిల్‌పై ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. నువ్వేమైనా అఆ మూవీలో సమంత అనుకుంటున్నావా? అని ఓ మీమ్ క్రియేట్ చేశాడు. దీనికి స్పందించిన అనసూయ అయ్యయ్యో.. లేదమ్మా.. నన్ను అనసూయ అంటారని రిప్లై ఇచ్చింది. దాంతో సదరు నెటిజన్.. సారీ మేడమ్.. ఏదో సరదాగా (కిడ్డింగ్)చేశాను.. లైట్‌గా తీసుకోండి అని రిప్లై ఇచ్చాడు.

దానికి మళ్లీ అనసూయ స్పందించారు.. అవును.. మానసికంగా చిన్న పిల్లవాడివే( కిడ్)నని అర్థమైందని రాశారు. త్వరగా ఎదగాలని కోరుకుంటున్నా అంటూ రిప్లై ఇచ్చింది. దీనిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో అనసూయ పోస్ట్ చేశారు. దీంతో తన జోలికి ఎవరైనా వస్తే వదిలిపెట్టబోనని హాట్ యాంకర్ తన చేతలతో స్పష్టంచేశారు. దీంతో అల్లరి చేసే యువత అనసూయకు కాస్త దూరంగా ఉంటేనే బెటర్. లేదంటే అనసూయ ఆగ్రహానికి బలికాక తప్పదని అర్థమవుతోంది. సో యూత్.. జర అనసూయతో జాగ్రత్తగా ఉండండి.. లేకపోతే మీకు కూడా గట్టిగా కౌంటర్ తప్పదు.